MSK Wealth Creation

MSK Wealth Creation MSK WEALTH CREATION IS FINANCIAL SERVICES
DEALS WITH MUTUAL FUNDS, STOCK MARKET, STOCK ANALYSIS, SIP MSK WEALTH CREATION IS ALL ABOUT STOCK MARKET

12/10/2024

🎉 A Major Milestone: 150 Active Members! 🎉

I’m excited to announce that we’ve hit 150 active members in our company! 🚀

In today’s competitive environment, where trust is more valuable than ever and fraudulent companies are on the rise, reaching this milestone feels even more significant. It’s a testament to the integrity, dedication, and hard work of everyone involved. We’ve built something real and meaningful together.

To the entire team, thank you for believing in the vision and staying committed through every challenge. Your passion and determination have set us apart and made this achievement possible.

Here’s to continued growth, trust, and success! Together, we’re unstoppable. 🙌



Regards
*MSK FINTECH SERVICE*

20/04/2023
12/01/2023
10/01/2023

Hello friends please like share and comment and support me

07/01/2023
05/01/2023

ఎన్‌సీసీకి రూ.3,601 కోట్ల ఆర్డర్లు :

డిసెంబరు నెలలో కొత్తగా రూ.3,601 కోట్ల విలువైన ఐదు ఆర్డర్లను దక్కించుకున్నట్లు :

డిసెంబరు నెలలో కొత్తగా రూ.3,601 కోట్ల విలువైన ఐదు ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎన్‌సీసీ లిమిటెడ్‌ వెల్లడించింది.

ఇందులో రెండు ఆర్డర్లు ఎలక్ట్రికల్‌ విభాగానికి లభించాయని, వీటి విలువ రూ.993 కోట్లని పేర్కొంది.

ఈ ఆర్డర్లు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి లభించాయి. కాగా భారీ ఆర్డర్లను దక్కించుకోవటంతో సోమవారం బీఎ్‌సఈలో కంపెనీ షేరు 9.3 శాతం పెరిగి రూ.91.70 వద్ద క్లోజైంది.

05/01/2023

మమఎర్త్ మరో పేటీఎం కాబోతోందా?

మమఎర్త్ (Mamaearth) వంటివాటిని తయారు చేస్తున్న హొనస కన్స్యూమర్ లిమిటెడ్ (Honasa Consumer Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్.

మమఎర్త్ (Mamaearth) వంటివాటిని తయారు చేస్తున్న హొనస కన్స్యూమర్ లిమిటెడ్ (Honasa Consumer Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు వెళ్ళడంతో ట్విటర్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది మరో పేటీఎం కాబోతోందని జోస్యం చెప్తున్నారు. పేటీఎం భారీ అంచనాలతో ఐపీఓకు వెళ్ళి చతికిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

హొనాస కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ కోసం కేపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI)కి దరఖాస్తు చేసింది.

ప్రమోటర్లు, మదుపరులు, ఇతర సెల్లింగ్ షేర్‌హోల్డర్ల ద్వారా 4,68,19,635 ఈక్విటీ షేర్స్ ఆఫర్-ఫర్-సేల్ (OFS) కాంపొనెంట్, దీనితోపాటు రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్స్‌ ఈ ఐపీఓలో ఉన్నట్లు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) చెప్తోంది.

నీరజ్ అరోరా అనే ట్విటర్ యూజర్ ఇచ్చిన ట్వీట్‌లో, 2022 జనవరిలో మమఎర్త్ లాస్ట్ వాల్యూయేషన్ 1.2 బిలియన్ డాలర్లు అని పేర్కొన్నారు.

ఈ కంపెనీ ఇప్పుడు రాబోయే తన ఐపీఓ కోసం 3 బిలియన్ డాలర్లు వాల్యుయేషన్‌ను కోరుతోందని, గత ఏడాది మమఎర్త్ లాభాలు రూ.22 కోట్లు అని, ఈ కంపెనీ తన టార్గెట్ వాల్యుయేషన్‌ వద్ద పబ్లిక్‌కు వెళ్తే, దాని లాభాలకు 1,000 రెట్లు విలువ కడతారని తెలిపారు.

ఉదాహరణకు, హెచ్‌యూఎల్ యొక్క గత ఏడాది లాభాలు రూ.9,000 కోట్లు అని, ఆ కంపెనీ వాల్యుయేషన్ పబ్లిక్ మార్కెట్‌లో రూ.6 లక్షల కోట్లు అని, 66 రెట్లు అని తెలిపారు.

శిల్పా శెట్టి 0.75 కోట్లు మమఎర్త్‌లో పెట్టుబడి పెట్టారని, ఈ కంపెనీ తన టార్గెట్ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు వద్ద పబ్లిక్‌కు వెళ్తే, శిల్పా శెట్టి పెట్టుబడి విలువ రూ.80 కోట్లు కావచ్చునని తెలిపారు.

ఓఎఫ్ఎస్‌లో షేర్స్ ఆఫర్ చేస్తున్నవారిలో ప్రమోటర్లు వరుణ్ అలఘ్, ఘజల్ అలఘ్, పెట్టుబడిదారులు ఫైర్‌సైడ్ వెంచర్స్ ఫండ్, సోఫినా, స్టెల్లారిస్, కుణాల్ బన్సల్, రోహిత్ బన్సల్, రిషభ్ హర్ష్ మరివాలా, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఉన్నారు.

శకటస్ హొమ్మ అనే ట్విటరాటీ స్పందిస్తూ, తన మాటలు గట్టిగా తగులుతాయన్నారు.

ప్రస్తుత ఐపీఓ వాల్యుయేషన్‌ వద్ద రిటెయిల్ ఇన్వెస్టర్ తన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి 100 సంవత్సరాలు పట్టవచ్చునని తెలిపారు.

మమఎర్త్‌కు తాను దూరంగా ఉంటానని, మిగిలినవారు కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు.

మరో యూజర్ స్పందిస్తూ, రూ.400 కోట్ల నిధుల సేకరణ వల్ల కంపెనీ లాభాలు రూ.240 కోట్లకు చేరుతాయని, నూటికి నూరు శాతం లాభాలను డివిడెండ్‌గా ఇస్తారని భావించినప్పటికీ, ద్రవ్యోల్బణం రేటు వద్ద స్టార్టప్ మరింత వృద్ధి చెందుతుందని భావించినప్పటికీ, అమాయక పెట్టుబడిదారు తన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి 100 సంవత్సరాలు (వాల్యుయేషన్ రూ.24,000 కోట్లు) పడుతుందని చెప్పారు.

మరో యూజర్ స్పందిస్తూ, ఐపీవో వాల్యుయేషన్ల కోసం ఇంత పిచ్చి ఎందుకో అర్థం కావడం లేదన్నారు. గతంలో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల అభిప్రాయానికి విలువ ఇచ్చి ఉండవలసిందన్నారు.

పేటీఎం (Paytm) ఐపీఓ లిస్టింగ్ రోజునే చతికిలపడిన విషయాన్ని ట్విటరాటీలు గుర్తు చేస్తున్నారు. Mamaearth IPO కూడా అదే విధంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ విభోర్ వార్షణేయ్ ఇచ్చిన ట్వీట్‌లో, 2023 కోసం తన మొదటి తీర్మానం మమఎర్త్ ఐపీఓకు దరఖాస్తు చేయకూడదనేదేనని చెప్పారు. మరో పేటీఎం సిద్ధమవుతోందన్నారు.

వాల్యుయేషన్స్, ప్రైస్ బ్యాండ్ ఏదైనప్పటికీ, రూ.22 కోట్లు లాభాలు ఆర్జించిన కంపెనీ రూ.24 వేల కోట్ల వాల్యుయేషన్ కోరుతోందన్నారు.

మమఎర్త్ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఆ ఐపీఓను సిఫారసు చేసే విశ్లేషకులు లేదా ఇన్వెస్ట్‌మెంట్ గురూస్, దీనిని ప్రమోట్ చేసే మీడియా నెంబర్ వన్ మోసగాళ్ళని అర్థం చేసుకోవాలని మరో ట్విటరాటీ చెప్పారు.

అలాంటివారిని భవిష్యత్తులో బాయ్‌కాట్ చేయాలని సలహా ఇచ్చారు.

FY22లో ఈ కంపెనీ రూ.14 కోట్లు నెట్ ఎర్నింగ్స్‌తో లాభదాయకతను చూపించిందని మరో ట్విటర్ యూజర్ చెప్పారు.

FY21లో రూ.1,332 కోట్లు నష్టాలు వచ్చాయన్నారు. FY20లో రూ.428 కోట్లు నష్టం వచ్చిందన్నారు. FY23 మొదటి అర్ధ సంవత్సరంలో రూ.4 కోట్లు నికర లాభాన్ని చూపించిందన్నారు.

ఇదిలావుండగా, ఉత్పాదక ఖర్చులను తగ్గించుకోవడం వల్ల లబ్ధి పొందుతున్నట్లు ఈ కంపెనీ డీఆర్‌హెచ్‌పీ తెలిపింది.

FY22లో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 3 పెర్సెంటేజ్ పాయింట్లకు పైగా మెరుగుపడినట్లు పేర్కొంది.

05/01/2023

మూన్నాళ్ల ముచ్చటైన లాభాలు ; 636 పాయింట్లు ఆవిరి, ఫెడ్ మీటింగ్ భయాలు :

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ క్షీణతను నమోదు చేశాయి.

యూఎస్ ఫెడ్ డిసెంబర్ సమావేశపు మినిట్స్ వివరాలు బయటకొచ్చిన తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపారు.

ఇందులోని కీలక అంశాలను మార్కెట్ వర్గాలు నిశితందా పరిశీలిస్తున్నాయి.

సూచీల నేల చూపులు :

ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ర్యాలీని కొనసాగించాయి.

ఈ క్రమంలో చివరికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 636 పాయింట్లను కోల్పోయింది.

ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది.

ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 466 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 357 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.

దీంతో కొత్త సంవత్సరం లాభాలు మూడునాళ్ల ముచ్చటలా మారాయి..

అమెరికా మార్కెట్లు :

అమెరికా వాల్ స్ట్రీట్ 2023లో మంగళవారం తొలి ట్రేడింగ్ సెషన్ ప్రారంభించింది.

ఈ క్రమంలో నాస్‌డాక్ 0.76 శాతం క్షీణించగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.03 శాతం, S&P 500 సూచీ 0.4 శాతం క్షీణించాయి.

11 ప్రధాన S&P సెక్టార్‌లలో ఆరు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల ఐఎంఎఫ్ చీఫ్ సైతం 2023 కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ సమయంలో ముడి చమురు సైతం బ్యారెల్ కు 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

టాప్ గెయినర్స్ :

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ ముగింపు సమయానికి దివీస్ ల్యాబ్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్ :

ఇక ఇదే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

05/01/2023

కష్టాల్లోకి చందా కొచ్చర్ ; తీగ లాగుతున్న సీబీఐ :

దేశంలోని ప్రైవేటు రంగం దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ వీడియాకాన్ లోన్ స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకుంది.

కేసు సీబీఐ చేసికి వెళ్లటంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దీంతో కేసు పరిధిని సైతం సీబీఐ పెంచుతోంది. దీంతో మాజీ అధిపతి చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఉన్న కేసు సంగతి పక్కనబెడితే కొత్త కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శక్తి వంతమైన మహిళ నుంచి :

ఒకప్పుడు ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో నిలిచిన వ్యక్తి చందా కొచ్చర్. ఆయన భర్తకు చెందిన NUPOWER రెన్యూవల్స్ ఇప్పుడు లోన్ స్కామ్ లో కేంద్ర బిందువుగా మారింది.

దీపక్ కొచ్చర్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ. ఇది 180 మెగావాట్ల విండ్ ఎనర్జీ తయారీ సామర్థ్యం కలిగి ఉంది. ఆదాయం తగ్గటంతో కంపెనీ లిక్విడిటీ దెబ్బతింది.

ఈ కంపెనీలో వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టడంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి.

అరెస్టులు :

నెలల తరబడి విచారణ తర్వాత సీబీఐ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ ధూత్‌లను అరెస్టు చేశారు.

అయితే ఇప్పుడు సీబీఐ అధికారులు తమ విచారణ పరిధిని సైతం పెంచుతున్నారు.

వీడియోకాన్ గ్రూప్ పొందిన మెుత్తం 10 రుణాలపై దర్యాప్తు చేస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలను ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి సేకరిస్తోంది. వీటిలో నాలుగు కొచ్చర్ నేతృత్వంలో ఆమోదం పొందాయి.

ఇద్దరూ కలిసే :

కొచ్చర్ భర్త కంపెనీలో వీడియోకాన్ పెట్టుబడులు రుణాలు పొందటానికి ముందు జరిగాయి.

అయితే చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్ సంయుక్తంగా లోన్ మోసాలకు పాల్పడ్డారా లేదా అనే విషయం మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మెుత్తం రుణాలపై సీబీఐ ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో జూన్ 2009 నుంచి అక్టోబర్ 2011 మధ్య కాలంలో రూ.1,875 కోట్ల విలువైన 6 రుణాలు మంజూరయ్యాయని సీబీఐ దర్యాప్తులో తేలింది.

చట్టాల ఉల్లంఘన :

కొచ్చర్ కి ముందు జారీ అయిన 6 రుణాలు కూడా మోసపూరితంగా జరిగాయని వెల్లడైతే ఐసీఐసీఐ భారీ ఎదురుదెబ్బను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కొచ్చర్-ధూత్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లలో బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘన జరిగాయని సీబీఐ బలంగా నమ్ముతోంది.

దీనిపై సీరియస్ గా దర్యాప్తు నిర్వహిస్తోంది. 2010-2012 మధ్య మెుత్తం కొచ్చర్ సమయంలో వీడియోకాన్ రూ.3,250 కోట్ల రుణాన్ని పొందింది.

సీబీఐ కనిపెట్టిన విషయాలు :

లోన్ పొందిన తర్వాత వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ దీపక్ కొచ్చర్ కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్‌లో..

దాదాపు రూ.64 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీనికి తోడు ముంబైలో రూ.5.25 కోట్ల విలువైన ఒక భూమిని కేవలం రూ.11 లక్షలకు కొచ్చర్ కుటుంబానికి విక్రయించినట్లు సీబీఐ కనిపెట్టింది.

అక్రమాల డొంక మెుత్తం కదిపే పనిలో సీబీఐ సీరియస్ గా వర్క్ చేస్తోంది.

2023 జనవరి 15న కుమారుడి పెళ్లికి బెయిల్ కోరుతూ కొచ్చర్ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. విషయం అంత అర్జంట్ కాదంటూ బాంబే హై కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది..

05/01/2023

లిస్టింగ్ లోనే లాభాలు ; షేర్లు వచ్చినోళ్లకు పండగే :

2023లో మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి ఐపీవోగా రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ నిలిచింది.

ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 10% ప్రీమియంతో జాబితా చేయబడ్డాయి.

దీంతో 2023లో ఐపీవోల మార్కెట్ ఒక శుభారంభాన్ని నమోదు చేసింది.

మార్కెట్ ఓలటాలిటీ :

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇలాంటి అస్థిరతల మధ్య స్టాక్ మంచి ప్రీమియం ధరకు లిస్ట్ కావటం మంచి సూచికగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

స్టాక్ ఇష్యూ ధర రూ.94 ఉండగా దలాల్ స్ట్రీట్‌లో మంచి అరంగేట్రం చేశాయి.

అలా ఎన్ఎస్ఈలో 9.57 శాతం పెరిగి రూ.103 వద్ద స్టాక్ లిస్ట్ అయ్యింది.

అలాగే బీఎస్ఈ సూచీలో 5.6 శాతం వృద్ధితో రూ.99.30 వద్ద షేర్ ట్రేడింగ్ ప్రారంభించింది.

గ్రేమార్కెట్లో :

ఈ ఐపీవో గ్రే మార్కెట్లో తక్కువ ప్రీమియం కలిగి ఉంది. దీంతో విశ్లేషకుల అంచనాలను అధిగమించి స్టాక్ మార్కెట్లో మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. వారు స్టాక్ ఫ్లాట్ గా మార్కెట్లోకి అడుగుపెడుతుందని అంచనా వేశారు.

కానీ వాస్తవానికి షేర్ మంచి ప్రీమియం రేటుకు మార్కెట్లోకి అడుగుపెట్టింది.

డిసెంబర్ 23-27 మధ్యకాలంలో ఇష్యూ కేవలం 53 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ చేయబడింది.

కంపెనీ ఆఫర్-ఫర్-సేల్ భాగాన్ని భారీగా తగ్గించిన తర్వాత IPO ముగిసింది.

మెుత్తం క్యాపిటల్ :

కంపెనీ తన ఐపీవో ద్వారా రూ.51.27 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేసింది. దీనికి తోడు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో మరో రూ.199.5 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది.

ఈ రెండు మార్గాల ద్వారా కంపెనీ మెుత్తంగా రూ.250.76 కోట్లను సమీకరించింది.

అయితే దీనికి ముందు కంపెనీ తొలుత రూ.388 కోట్లను మార్కెట్ నుంచి రెయిజ్ చేయాలని నిర్ణయించింది.

అప్పట్లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.328 కోట్లు, తాజా ఇష్యూ ద్వారా రూ.60 కోట్లను సమీకరించాలని కంపెనీ భావించింది.

మధ్యలో నిర్ణయాన్ని మార్చుకుని ఐపీవోనూ పూర్తి చేసింది.

కంపెనీ వ్యాపారం :

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ 2005లో స్థాపించబడింది.

ఇది దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యవస్థీకృత రిటైల్, ఈ-కామర్స్ కంపెనీలకు రిటైల్ నగదు నిర్వహణ సేవలను అందిస్తోంది.

కంపెనీ ఒక్కో షేరు ధరను ఐపీవోలో రూ.94-99గా నిర్ణయించింది.

ఈ ఐపీవోను విజయవంతం చేయటంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ది హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పాల్గొన్నాయి.

బ్రోకరేజ్ ఏం చెప్పింది :

రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఐపీవో పెట్టుబడి విషయంలో స్టాక్‌బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి మాత్రం దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించారు.

అలాగే షేర్లు ఎలాట్ అయినవారు మార్కెట్లో మంచి అవకాశాల కోసం వెతకాలని సూచించారు.

హేమ్ సెక్యూరిటీస్‌లో ఫండ్ మేనేజర్, PMS హెడ్ మోహిత్ నిగమ్ మాత్రం కంపెనీ భవిష్యత్తు అవకాశాల సమాచారాన్ని అన్వేషించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

15/10/2022

Address

Secunderabad
Secunderabad
500047

Website

Alerts

Be the first to know and let us send you an email when MSK Wealth Creation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share