Pyramid masters

Pyramid masters this channel about meditation

29/11/2023
12/01/2023

మర్రి విత్తనం లో మహా వృక్షం ఉన్నట్లే సరైన సాధనలో అనగా శ్వాస మీద ధ్యాస అనే అతి చిన్న తేలికైన ధ్యానంలో అధ్బుతమైన అనంతమైన జ్ఞానం విజ్ఞానం ఆత్మజ్ఞానం పొందవచ్చని తెలుసుకోండి... గోరంత దీపంలో కొండంత వెలుగు అనుభవ పూర్వకంగా చూస్తున్నాం... సరైన సాధన కూడా చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోండి... సరైన సాధన ద్వారా మాత్రమే ఎన్నో ఎన్నెన్నో అద్భుత అధ్యాత్మిక విషయాలు, సత్యాలు తెలుసుకుంటారు..
రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు, భావాలు కల్గి యుంటారు... కానీ అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకే రకంగా ఉండేది ఆదర్శ వాదుల విషయంలో... వారియొక్క భావాలు, మాటలు, చేతలు దాదాపు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి... అందుకు ఉదాహరణ స్వామి వివేకానంద చెప్పిన నగ్న సత్యాలు.

12/01/2023

ఎవరు ఎవరినీ హీల్ చేయలేరు... సరైన సాధన ద్వారా మాత్రమే ఎవరికీ వాళ్లు హీల్ చేసుకోవాలి.. హీలింగ్ చేసేవారు హిప్నాటిజం ద్వారా మాయలోకి తీసుకు వెళతారు... సాధన ఎలా చెయ్యాలి అని తెలుసుకున్నాక తెలుసుకున్న సరైన సాధన మాత్రమే చేయండి... తెలియని మాయలో పడకండి.. తెలుసుకున్న సరైన సాధన మాత్రమే చేయండి... ఇప్పటికే చాలా మంది సాధకులు రకరకాలుగా మోసపోయారు, చాలా విధాలుగా నష్ట పోయారు.... కొద్దిగా ఆలోచించండి మరి కొద్దిగా సరైన సాధన మాత్రమే చేయండి..
అధ్యాత్మిక రంగంలో ఏ మార్గంలో కూడా హీలింగ్ ప్రస్తావన లేదు... ఆపరేషన్ చేసేటపుడు మత్తు ఇస్తారు అది చికిత్సలో భాగంగా... కానీ ఆ మత్తు ద్వారా రోగం తగ్గదు... హీలింగ్ కూడా అలాంటిదే... హీలింగ్ ధ్యానం కాదు...ధ్యానం కానపుడు నాడీ మండలం శుద్ధి జరగదు...నాడీమండలం శుద్ధి జరగ కుండా ఎలాంటి సమస్యలు 0% కూడా పరిష్కారం కుదరదు, దొరకదు.

12/01/2023

*::::::::::: వ్యసనాలు ::::::::::::::*
మనందరం ఏదో ఒక వ్యసనానికి గురి అవుతాము. ఇవి మనలను ఇబ్బంది కి గురి చేస్తాయి. .వ్యసనాలు నాలుగు రకాలు.
1) *ప్రభుత్వం అంగీకరించినవి*.
వీటిని ప్రభుత్వం తన ఆదాయం కోసం అంగీకరిస్తుంది. కాని పౌర సమాజం అంగీకరించదు. ముఖ్యంగా స్త్రీ సమాజం.
ఉదా మధ్య పాపం, ధూమపానం.
2) *అందరూ అంగీకరించేవి*.
ఉదా.. సెల్ ఫోన్ చూడటం, గేమ్స్ ఆడటం.
3) *ప్రభుత్వం అంగీకరించదు.* కాని సమాజం అంగీకరిస్తుంది.
ఉదా సంక్రాంతి కోడి పందాలు.
4) *సమాజం పట్టించు కోదు. ప్రభుత్వం ఊరుకోదు*.
ఉదా.సినిమా పైరవీ.
5) *కుటుంబాలు అంగీకరించవు* ఉదా..అతి నిద్ర,సోమరితనం,తిండిపోతు తనం
*ధ్యానం ఎలాంటి వ్యసనాన్ని అయినా మానిపిస్తుంది*

12/01/2023

*ఈ జీవితం నా సొంతం. అవునా ? ::::::*
నేను జీవిస్తున్నాను, ఈ జీవితం నాది అంటాం. నిజమేనా? చూద్దాం.
మనం తింటాం. ఇది మనం స్పృహ తో చేసేదే. దీని వెనుక నేను ఉండి నా ప్రయత్నం వుంది కనుక ఇది నా సొంతం.
తిన్నది అరగడం. ఇది మనం చేసేది కాదు. దానంతట అది జరిగే పని.అరగటం నేను చేసేది కాదు.కనుక నాది కాదు. నేను కాదు. దీనిని మనం సొంతం చేసు కోలేము.
ఈ రకంగా మన జీవితంలో 90%శాతం దానంతట అది జరిగే పనులు.మన నియంత్రణ లేదు.అనగా మనది కాదు.
ఇంక మన చేతిలోని 10%కూడా నిశితంగా పరిశీలించితే దీని వెనుక మనం లేము.. సంకల్పం, వెనుక ఉన్న ప్రేరణ నాది కాదు.
ఉన్నది ప్రకృతి లో భాగమైన మనో శారీరక వ్యవస్థ. ఈ వ్యవస్థ నాది నేను అనేది జ్ఞాపకాల ఆధారంగా, ఉన్న దానిని సొంతం చేసుకుంటున్న ఆలోచన.
ఉదా... చూపు సంభవిస్తూవుంది.అలా దానంతట అది సంభవించే చూపుని, నేను ఫలానా దానిని చూసాను అని చూపుని సొంతం చేసుకోవడం చేత నేను ఉనికి లోకి వస్తుంది.
చూచే వాడు చూపు జరిగిన తర్వాత వస్తున్నాడు. తినడం తినక పోవడం మన చేతిలోని పని అయినా దీని వెనుక ప్రేరణలు మన చేతుల్లో లేదు.
ఉదా.రైలు బండి వెనుక తోక పట్టుకొని వెళుతూ,నేను వెనుక వైపు నుంచి రైలు బండిని తోస్తున్నాను అన్నట్లు.
*సొంతం అనేది కేవలం ఆలోచనే (భ్రమ) .ధ్యానం దీనిని జాతీయం అనగా సమస్తం కి అంకితం చేస్తుంది

12/01/2023

*తావో మార్గము లావోత్జు విజ్ఞానము*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🪷 *సత్యం చెప్పబడదు. చెప్పబడేది సత్యం కాదు.*
*కరుణ పూరితమైన ఆలోచనలు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందిస్తాయి.* 🪷

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*తన గొప్ప విజయాలు తేలికగా భావించేవాడు తన శక్తిని ధీర్ఘకాలం భరిస్తాడు.*

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

*పార్ట్ -11*

🦋 *తెలివైన వ్యక్తి అంతరిక్షంలోకి చూస్తాడు మరియు అతనికి పరిమిత తలాలు లేవని అతను తెలుసుకుంటాడు.*

🦋 *సమయం అనేది సృష్టించబడిన విషయం. నాకు సమయం లేదు అని చెప్పడం, నాకు అక్కరలేదు అని చెప్పినట్లే.*

12/01/2023

ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని,
తన వేటకుక్కలను మీదకు వదిలి,
దారుణంగా చంపించేవారు.

ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు.
రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు.
మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.
మంత్రి 10 రోజుల గడువు కోరారు.
రాజు అనుమతించారు.

ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి,
తాను కుక్కలకు అన్నీరకాల సేవలు చేశారు.

10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.
కానీ కుక్కలు మంత్రిని దగ్గరికి తీసుకుని ముద్దాడాయి.
రాజు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగారు.

అప్పుడు మంత్రి "10 రోజుల సేవకే కుక్కలు విశ్వాసం చూపాయి.
కానీ మీరు 20సం. సేవచేసిన నన్ను,
ఒక్కతప్పుకే మరణశిక్ష వేశారు.
తప్పు ఎవరయినా చేస్తారు. కానీ పరిస్థితులను బట్టి,
వెనుకటి ప్రవర్తన బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి.

ఆవేశం కన్నా, ఆలోచన ఉండాలి.
శిక్ష విధించడం కన్నా, బంధాలు,
ప్రేమతో మార్పు తేవాలి"అన్నారు.
అలాగే మనసు మాయను మచ్చిక చేసుకోవాలి, అన్నిరకాల సమస్యలను accept చేస్తూ బుజ్జగించి ప్రేమించి బయటకు పంపాలి. కావాల్సినవి ప్రేమించి ఆహ్వానించాలి.. అందుకు సరైన సాధన చేయ్యాలి, అన్నీ నీలోనే నీతోనే ఉంటే ఎక్కడికి ఉరుకులు, పరుగులు, తెలియనప్పుడు చేశాం తప్పు లేదు తెలిశాక కూడా చేస్తే వారిని ఈ సృష్టిలో ఎవరూ మార్చలేరు, మార్పు రాదు...సత్యాన్ని తెలుసుకున్నాక కూడా సరైన సాదన చేయకపోతే చేసేదాకా జనన మరణ చక్ర బంధం లోనే తిరుగుతూ ఉంటారు... ఆన్ని సబ్జెక్ట్ లలో ఉత్తీర్ణత సాధించే వరకూ మార్చి - సెప్టెంబర్ పరీక్షలు తప్పవు.
నీకున్న రకరకాల సమస్యలు ద్వారా సమాజం, బంధు మిత్రుల నుండి అవమానాలు, హేళనలకు గురి అవ్వడం జరుగుతుంది... వాటి గురించి అలోచించి ఆవేదన పడే కన్నా వాటన్నింటి నుండి బయటపడే ప్రయత్నంనకు సమయాన్ని అనగా సరైన సాధన చేస్తే సరిపోతుంది... అపుడు అవమానించినవారే అభినందిస్తారు, హేళన చేసిన వారే కీర్తిస్తారు..

# # # #

12/01/2023

*శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"ఆపదలో ఆదుకున్న ఆప్తుడ్ని
బాధను పంచుకున్న బంధువుని
మంచి సలహా ఇచ్చి మేలు కోరే మిత్రుని
ఆపదలో ధైర్యం చెప్పే ఆత్మీయుడిని
జీవితంలో ఎన్నడూ దూరం చేసుకోవద్దు.
దూరం పెట్టవద్దు."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"మనకు తెలిసింది నలుగురికి పంచాలి.
మనకు తెలియంది నలుగురిని అడిగి తెలుసుకోవాలి."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

12/01/2023

యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గ దర్శకుడు, భారత దేశ ఖ్యాతిని, సంస్కృతి సాంప్రదాయాల విలువలను ప్రపంచంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆదర్శవంతుడు ఆయన స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

*"రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి*
*లేకపోతె ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు"*

*- స్వామి వివేకానంద.*

12/01/2023

_*✍🏻 స్వామీ వివేకానంద స్ఫూర్తి వచనాలు...*_

_*◆ రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.*_

_*◆ నీ వెనుక ఏముంది, ముందేముంది, అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.*_

_*◆ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.*_

_*◆ ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.*_

_*◆ ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.*_

_*◆ విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!*_

12/01/2023

🌅 *శుభోదయం*
---------------------------
🌻 *మహానీయుని మాట*🌸
-------------------------

_"ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే_
_అది బలహీనతగా మారుతుంది._
_ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే_
_అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది."_
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
_సింహం ఎప్పుడూ సింహాసనం కోసం_
_పాకులాడదు......._
_అది ఎక్కడ కూర్చుంటే ఆ స్థానమే_
_సింహంకు సింహాసనం అవుతుంది_
_అలాగే నీతిమంతులకు గుంపులతో_
_పని ఉండదు..........._
_వారు ఎక్కడ ఉన్న వారి వన్నె తగ్గదు._

🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁
ఆత్మీయులు అయిన మీకు _
*_ సదా మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వుండే
మీ
꧁ꕥ🌱 *N.SANDEEP*🌱ꕥ꧂
🌹LIC ADVISOR
🌹STAR HEALTH INSURANCE
🌹INSTRUMENTATION ENGINEER
🌹DIGITAL MARKETING
📱-8500007705
💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐
꧁ꕥ🌱🙏🙏🙏🌱ꕥ꧂
🥭🌹🍇🍫🪷🌺🌸

Address

Naidupeta
524126

Telephone

+918500007705

Website

Alerts

Be the first to know and let us send you an email when Pyramid masters posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pyramid masters:

Share