ssshousings

ssshousings Helping You Find The Property Of Your Dreams

19/10/2017
27/06/2017
మాట వినే లైటువార్తలు.. విశేషాలు ఏంటి? పాటలు ప్లే చేయ్‌, ఆకలేస్తోంది పిజ్జా ఆర్డర్‌ ఇవ్వు! ఇలా మీరు ఏదైనా చెప్పగానే ఠక్కు...
27/04/2017

మాట వినే లైటు
వార్తలు.. విశేషాలు ఏంటి? పాటలు ప్లే చేయ్‌, ఆకలేస్తోంది పిజ్జా ఆర్డర్‌ ఇవ్వు!
ఇలా మీరు ఏదైనా చెప్పగానే ఠక్కున పసిగట్టి ఆ పని చేసే అసిస్టెంట్‌ మీకు కావాలా! అయితే ఈ లైట్‌తో అది సాధ్యమవుతుంది. లైటు ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని లైట్‌ తీసుకోకండి. ‘జీఈ’కు చెందిన ‘సి’ అనే ఈ ఎల్‌ఈడీ స్మార్ట్‌ ల్యాంప్‌ వెలుగునివ్వడంతో పాటు మీకు సహాయకురాలిగా వ్యవహరిస్తుంది. అంతర్జాలంలో మీకు కావల్సిన వివరాలు తెలపడం, క్రికెట్‌ స్కోరు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ లాంటి పనులు దీని ద్వారా చేసుకోవచ్చన్నమాట. మనుషుల మాటలు విని అర్థం చేసుకొని వాటికి తగ్గట్టు స్పందించే సాంకేతిక లైటు ఇది. అలెక్సా, అమెజాన్‌ల వాయిస్‌ కంట్రోల్‌ సాంకేతికతతో పని చేస్తుంది. దీన్ని తొలుత వైఫైతో కనెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ లైటు అనుబంధ ఆప్‌ను మొబైల్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని అనుంసంధానం చేసి మీకు కావల్సిన పనులు చేసుకోవచ్చు. మొబైల్‌లోని ఆప్‌తో ఈ లైట్‌ను యాక్సెస్‌ చేయొచ్చు కూడా. ఇటీవల విడుదలైన ఈ సాంకేతిక బల్బు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రపంచ మార్కెట్‌లోకి వస్తుంది.

వాలెట్‌లో భద్రంకార్డులు.. పెన్‌డ్రైవ్‌లు.. బైక్‌ తాళం చెవి.. కరెన్సీ నోట్లు.. కుర్రకారుని నిత్యం అంటిపెట్టుకొని ఉండే వస...
27/04/2017

వాలెట్‌లో భద్రం

కార్డులు.. పెన్‌డ్రైవ్‌లు.. బైక్‌ తాళం చెవి.. కరెన్సీ నోట్లు.. కుర్రకారుని నిత్యం అంటిపెట్టుకొని ఉండే వస్తువులు ఎన్నో. వీటన్నింటినీ జేబు లేదా పర్సులో వేసుకొని వెళ్లాలంటే కష్టం. ఈ ప్రయాస తప్పించడానికే ‘వెసెల్‌ కంపార్ట్‌మెంట్‌ వాలెట్‌’ వచ్చింది. ఇందులో నాలుగు అరలుంటాయి. కార్డులు, కరెన్సీ, తాళాలు.. ఇతర విలువైన వస్తువులు ఏవైనా భద్రంగా దాచుకోవచ్చు. మునివేళ్లతో తాకుతూ అరల్ని మార్చేసుకోవచ్చు. ధర రూ.మూడువేలు.

నిద్రపుచ్చే యాప్‌తెల్లవారేదాకా సినిమాలు... షికార్లు... చాటింగ్‌లతో చెలరేగిపోవడం. బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేకపోవడం....
27/04/2017

నిద్రపుచ్చే యాప్‌

తెల్లవారేదాకా సినిమాలు... షికార్లు... చాటింగ్‌లతో చెలరేగిపోవడం. బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేకపోవడం. యూత్‌కిలాంటివి మామూలే. ‘అలాచేస్తే ఆరోగ్యానికి మంచిదికాదు’ అంటే పట్టించుకుంటారా ఈతరం కుర్రకారు? వూహూ... ఇదే విషయాన్ని మన సెల్‌ఫోనే చెబితే? తప్పకుండా వింటారు. Good morning alarm clock అనే యాప్‌తో ఇది సాధ్యమే. ఈ అప్లికేషన్‌ మనం రోజుకు ఎన్నిగంటలు నిద్రపోవాలో చెబుతుంది. ఎన్ని గంటలు నాణ్యమైన నిద్రపోయారో లెక్కలు తీస్తుంది. మనం హాయిగా కునుకు తీయడానికి మంద్రమైన సంగీతం వినిపిస్తుంది. దాని ప్రకారం ఎన్ని గంటలకు మేల్కోవాలో కూడా చెబుతుంది. ప్రయత్నించండి మరి.

మీ టీవీనిలా... మార్చేయండి స్మార్ట్‌గా!ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ పాతదైపోయింది... కొత్తది తీసుకుందామండీ! స్మార్ట్‌ టీవీలు వచ్చాయ...
27/04/2017

మీ టీవీనిలా... మార్చేయండి స్మార్ట్‌గా!
ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ పాతదైపోయింది... కొత్తది తీసుకుందామండీ! స్మార్ట్‌ టీవీలు వచ్చాయంట... చాలా బాగున్నాయంటున్నారు! మీ ఇంట్లోనూ ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయా? కొత్త ఆప్షన్లతో వస్తున్న టీవీ అంటే అందరికీ ఆసక్తే మరి... అందులోనూ అంతర్జాలం సాయంతో పని చేసేవంటే ఇంకా ఆసక్తి! అయితే స్మార్ట్‌ టీవీ కోసం మీ టీవీని అమ్మేసి కొత్తది కొనక్కర్లేదు. మీ పాత ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ టీవీకి ‘స్టిక్స్‌’ జోడిస్తే సరి. ఎంచక్కా మీ ఇంట్లో స్మార్ట్‌ టీవీ చూసేయొచ్చు!

20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా ఫోన్‌ ఇది! ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ...
27/04/2017

20 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా ఫోన్‌ ఇది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం యువతలో ఉన్న సెల్ఫీ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ వీవో ‘వీ5ఎస్‌’ పేరుతో సరికొత్త మొబైల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ముందు 20 మెగాపిక్సెల్‌ కెమేరా ఉండటం ఈ ఫోను ప్రత్యేకత. దీని ధర రూ.18,990గా నిర్ణయించారు. మే 6వ తేదీ నుంచి అన్ని రిటైల్‌ స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోను అందుబాటులోకి రానుంది.
‘పరిమిత సంఖ్యలో వీవో వీ5ప్లస్‌ను విడుదల తర్వాత ఇప్పుడు మిమ్మల్ని థ్రిల్‌కు గురిచేసే మరో ఫోన్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఉత్తమమైన సెల్ఫీ కెమేరా ఫోన్‌గా మార్కెట్‌ను సుస్థిరం చేసుకోవడమే మా లక్ష్యం’ అని వీవో ఇండియా సీఈవో కెంట్‌ ఛెంగ్‌ తెలిపారు.
వీవో వీ5ఎస్‌ ప్రత్యేకతలు
* 5.5 అంగుళాల తాకే తెర
* 20 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
* 13 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
* 4 జీబీ ర్యామ్‌
* 64 జీబీ అంతర్గత మెమొరీ
* 256 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం
* 64బిట్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

వందేళ్లు దాటినా.. వంటలు అదుర్స్‌!డాక్యుమెంటరీ చేయనున్న బీబీసీ! దేశవిదేశాల్లో అభిమానులు! లక్షల్లో చందాదారులు!గుడివాడ.... ...
27/04/2017

వందేళ్లు దాటినా.. వంటలు అదుర్స్‌!

డాక్యుమెంటరీ చేయనున్న బీబీసీ!
దేశవిదేశాల్లో అభిమానులు!
లక్షల్లో చందాదారులు!

గుడివాడ.... తెనాలికి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ చిన్న పల్లెటూరు. ఆ గ్రామ ప్రజలకి కృష్ణమ్మ పరవళ్లు తప్ప... ప్రపంచం తెలియదు. అసలు యూట్యూబ్‌ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వూరు ఇప్పుడు వందేళ్లు పైబడిన ఓ బామ్మ వల్ల యావత్‌ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాత ఛానల్‌ అయిన బీబీసీని సైతం ఆ వూరికి రప్పించింది. ఆ బామ్మ ఎవరో కాదు కంట్రీఫుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ. ఈనెల పదో తారీఖున నూట ఆరో పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలివిగో..



వంటల కార్యక్రమాలంటే ఎలా ఉంటాయి... ఆధునిక వసతులున్న ఏసీ గదుల్లో చెఫ్‌లు వండుతుంటారు. వ్యాఖ్యాత తయారీని వివరిస్తుంటుంది. లేదంటే ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తమకు తెలిసిన వంటల్ని వండి చూపిస్తుంటారు. నిజానికి మనం ఆ వంటల కార్యక్రమాలు చూస్తామే గానీ.. చాలా పదార్థాలు మనకు తెలియవు. ఒకవేళ తెలిసినా ఎక్కడ అమ్ముతారో తెలియదు. అయినా కొత్త కాబట్టి మనకు కాస్త వింతగానే ఉండి చూసేస్తుంటాం కదా! ఈ బామ్మ మాత్రం.. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈతరానికి ఆ పదార్థాల్ని పరిచయం చేస్తోంది. కుక్కర్లు, మిక్సీలు ఏమీ ఉండవు. వంటకాల్లో వాడేవన్నీ మనకు ఇంట్లో దొరికేవే. ఉప్పు, కారం, మసాలాలు వేయాలంటే ప్రత్యేకంగా కొలతలూ, అందుకు చెంచాలూ అవసరం లేదామెకి. అనుభవంతో ఉజ్జాయింపుగా వేస్తుంది. దాదాపు ఆరు నెలల్లో ఆమ్లెట్‌, రొయ్యలూ, పీతలూ, దోసకాయ చికెన్‌, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటి వంటకాలెన్నో తనదైన శైలిలో చేసి చూపింది. అందుకే దేశ విదేశాల్లోని 42 మిలియన్ల మంది వాటిని చూశారు. ఆ ఛానల్‌కి రెండున్నర లక్షల మందికిపైనే చందాదారులుగా మారిపోయారు. నూట ఆరేళ్ల ఈ బామ్మకి దేశవిదేశాల్లో అభిమానులున్నారు. చీరలూ, గ్రీటింగు కార్డులు పంపుతున్నారు. సన్మానం చేస్తామని ఆహ్వానం అందిస్తున్నారు. అదంతా ఈ బామ్మ చేతివంట మహత్యమే.
అద్దాల్లేకుండానే: మస్తానమ్మ నిన్న మొన్నటి వరకూ పొలం పనులు చేసుకునేది. ఇప్పటికీ చూపు బాగా కనిపిస్తుంది. కూరగాయలు కోసినా, వంటలు వండి వార్చినా కళ్లద్దాలు అవసరం లేదు. చురుగ్గా ఉంటుంది. చకచకా నడుస్తుంది. వంటలు చేసేటప్పుడు ఆమె కూరగాయలు కత్తిపీటతో కోస్తుంది. చేస్తూనే వాటి గురించి చెబుతుంటుంది. మస్తానమ్మ పుట్టి పెరిగిందీ, అత్తారి వూరు గుడివాడే. ఆమె ఆ వూరు సరిహద్దులు దాటి బయటకు వెళ్లింది చాలా అరుదు. పదకొండేళ్ల వయసులోనే పెళ్లైంది. ఐదుగురు పిల్లలు. నలుగురు పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనుమలు ఉన్నా... తన భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే జీవితం వెళ్లదీసేది.
రుచి చూశాకే ఆలోచన: ఏడు నెలల క్రితం ఆమె మనవడు లక్ష్మణ్‌ స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి బామ్మని చూడటానికి వెళ్లాడు. మనవడు వచ్చాడని తానే స్వయంగా టొమాటో కూర చేసి అన్నం వండి పెట్టింది. ఆ వయసులో ఆమె చాకు కూడా లేకుండా టొమాటోను ముక్కలుగా కోయడం, వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఆసక్తిగా అనిపించాయి. పైగా కూరకూడా అద్భుతమైన రుచి. దాంతో వారి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె చేత ఆరుబయట వంట చేయించి యూట్యూబ్‌లో పెడితే బాగుంటుందని అనుకున్నారు. అదే విషయం మస్తానమ్మని అడిగారు. ‘పాత కాలం వంటలు మీకేం నచ్చుతాయి నాయనా’ అంటూ బోసి నోటితో నవ్వేసింది. అయినా వాళ్లిద్దరూ వదలకుండా ఆమెతో పల్లెటూరి పద్ధతితో బెండకాయ కూర చేయించారు. అదే మొదటి వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంట వెంటనే మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్‌ అనే ఛానల్‌ ద్వారా పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. వండి వార్చడంలో ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన అరవై శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు బాగా స్పందన వచ్చింది. నెలరోజుల్లో ఆరులక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, రోస్టెడ్‌ ప్రాన్స్‌నూ ఎక్కువ మందే వీక్షించారు.
ఎల్లలు దాటిన అభిమానం: ఈ వంటలను భారతీయుల తరవాత అమెరికా, జర్మనీ, ఇంగ్లండ్‌, పాక్‌లో ఉన్న ప్రవాస భారతీయులతోపాటు, విదేశీయులూ చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అవ్వడమే కాదు మొన్న ఆమె పుట్టిన రోజుసందర్భంగా పాక్‌ నుంచి ఫ¾ర్హాన్‌ అనే ఓ అభిమాని చీర, గ్రీటింగ్‌ కార్డు పంపాడు. అది చూసుకుని మస్తానమ్మ ఎంతగానో మురిసిపోయింది. ఆమెరికా, న్యూజిలాండ్‌ నుంచి కొన్ని భారతీయ కుటుంబాలు ఆమెను సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. లండన్‌కి చెందిన బార్‌ క్రాఫ్ట్‌ అనే ఛానల్‌ నుంచి కొందరు వచ్చి ఈ మధ్యనే మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకుని వెళ్లారు. బీబీసీ కూడా అదే పనిలో ఉంది. ఇక ఈ వంటలను చూసేవారిలో యువతులే ఎక్కువ. వారు తిరిగి ఇదే వంటలను ప్రయత్నించి వీడియోలు తీసి బామ్మ వంటకి కామెంట్‌గా పోస్టు చేస్తున్నారు. అంతేకాదు కొత్త వంట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే జాబితాలోనూ వారున్నారంటే నమ్ముతారా!

కోహ్లీ బెంగళూరుకు చావో రేవో గుజరాత్‌ లయన్స్‌తో రెండో పోరు ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజ...
27/04/2017

కోహ్లీ బెంగళూరుకు చావో రేవో
గుజరాత్‌ లయన్స్‌తో రెండో పోరు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజన్‌లో దురదృష్టం వెంటాడుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నేడు గుజరాత్‌ లయన్స్‌తో రెండో సమరానికి సిద్ధమైంది. సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌ రెండు విజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో దిగాలుపడ్డ కోహ్లీసేన 5 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇక అన్ని మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్‌ చేరుకోవడం కష్టమే అని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన మ్యాచ్‌ల్లో మిగతా జట్ల ప్రదర్శనను బట్టే కోహ్లీసేన భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది.
బెంగళూరుదే పై చేయి
సీజన్‌లో తలపడ్డ తొలిమ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించలేకపోయింది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కోహ్లీసేనదే విజయం. ఆర్‌సీబీ ఆ మూడుసార్లు 180, 248, 213 స్కోర్లు చేసింది. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గుజరాత్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. అతడు ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహమే. ప్రస్తుతం వూపుమీదున్న బ్రెండన్‌ మెక్‌కలమ్‌కు టీ20ల్లో బెంగళూరు స్పిన్నర్లు శామ్యూల్‌ బద్రీ (34 బంతుల్లో 26, 2 సార్లు ఔట్‌), చాహల్‌ (23 బంతుల్లో 20, 3 ఔట్లు)పై మంచి రికార్డు లేదు. ఈ మ్యాచ్‌లో బద్రీ ఆడకపోతే నేగీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అమ్మో.. డివిలియర్స్‌, కోహ్లీ
గుజరాత్‌ లయన్స్‌పై విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉంది. వీరిపై కోహ్లీ సగటు 91, స్ట్రైక్‌రేట్‌ 160.58. ఇక డివిలియర్స్‌ సగటు 228, సగటు 198.26 కావడం గమనార్హం. లయన్స్‌కు పవర్‌ప్లే ఓవర్లలో చెత్త ఎకానమీ (9.80) ఉండటంతో వీరిద్దరూ విరుచుకుపడే అవకాశం ఉంది. గుజరాత్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా సైతం ఆశించిన రీతిలో వికెట్లు తీయడం లేదు. ఈ సీజన్‌లో క్రిస్‌గేల్‌ ఫామ్‌లో లేడు. పవర్‌ప్లేలో ఆడిన 70 బంతుల్లో 69 పరుగులే చేశాడు. అందులో 61.5% డాట్‌బాల్స్‌ కావడం గమనార్హం. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న రెండు జట్ల సమరంలో ఎవరు బాగా బౌలింగ్‌ చేస్తారో వారినే విజయం వరించనుంది.

24/04/2017
ఫ్రెండూ ఫ్రెండూ... కావొద్దోయ్‌ ఫ్రెనెమీ! చేతిలో చేయేసి.. భుజం భుజం రాసుకొని తిరిగేది స్నేహితుడు... దూరంగా ఉంటూనే కీడు చే...
22/04/2017

ఫ్రెండూ ఫ్రెండూ... కావొద్దోయ్‌ ఫ్రెనెమీ!
చేతిలో చేయేసి.. భుజం భుజం రాసుకొని తిరిగేది స్నేహితుడు... దూరంగా ఉంటూనే కీడు చేయాలని చూసేవాడు శత్రువు... కష్టం సుఖం.. సంతోషం బాధ.. అన్నింట్లో ఫ్రెండ్‌ పక్కనుంటే భరోసా... గిట్టని వాళ్లకి సాధ్యమైనంత దూరంగా ఉంటే మనసుకి నిశ్చింత... ఈ హితుడూ, విరోధి కాకుండా మూడో కేరక్టరూ ఉందండోయ్‌! తనే ఫ్రెనెమీ... మిత్రుడి రూపంలో మన పక్కన ఉంటూనే గోతులు తీసే శత్రువు! ఇలాంటి వాళ్లను పసిగట్టడమెలా? పని పట్టడమెలా? లక్షణాలేంటి? లక్షణంగా ఉండటమెలాగో చెబుతున్నారు నిపుణులు.

స్నేహం వదిలేయండి
నిజమైన స్నేహితుడు కష్టాల్లో ఆదుకుంటాడు. మంచి చేస్తే పొగుడుతాడు. పక్కదారి పడితే సహేతుకంగా విమర్శిస్తాడు. ఫ్రెనెమీకి మనలోని లోపాల్ని ఎత్తిచూపుతూ, నలుగురిలో చులకన చేయడమే లక్ష్యం. ఒకవేళ మన ముందు పొగిడినా వెనక కుటిల ప్రయత్నాలు మానడు. ఇలాంటివారితో అనుబంధాలు, వృత్తి, ఆర్థికంగా... అన్నింట్లో మైనస్సే. వీరి మాటలు, చేతల్లో అసూయ, ద్వేషం, కపటత్వం జాగ్రత్తగా గమనిస్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీరితో స్నేహం కొనసాగించాలనుకుంటే మొహమాటం లేకుండా పద్ధతి మార్చుకొమ్మని మొహం మీదే చెప్పేయాలి. మారకపోతే ఆ స్నేహాన్ని వదిలేయడమే ఉత్తమం.
- శ్రీనివాస సుబ్రహ్మణ్యం, కెరీర్‌ కౌన్సిలర్‌
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనుకోని కుర్రకారు అరుదే. కబుర్లు చెప్పడానికి.. కలిసి చదువుకోవడానికి.. సరదాలకు.. ఆపదల్లో ఆదుకోవడానికి.. సలహాలివ్వడానికి.. ఆర్థిక సమస్యలు గట్టెక్కించడానికి.. ప్రతి అవసరానికీ ఫ్రెండే కావాలి. మన జీవితంలో అంత ప్రాముఖ్యం ఇచ్చే మిత్రుల్లోనే కొందరు మనకి నష్టం చేకూర్చే వాళ్లు ఉన్నారంటే పంటికింద రాయిలా మనకెంత బాధ?
కనిపెడదామిలా
కాస్త మనసు పెడితే ఎవరు స్నేహితులో, ఎవరు ఫ్రెండ్‌ రూపంలో ఉన్న శత్రువో తెలుసుకోవడం కష్టమేం కాదంటారు మనస్తత్వ నిపుణురాలు వైదేహీరావు. ఆమె చెబుతున్న ఫ్రెనెమీ లక్షణాలివి.
తొందరెక్కువ: ఫ్రెనెమీకి తొందరెక్కువ. స్నేహం మొదలైన తక్కువ కాలంలోనే అతి సాన్నిహిత్యం ఆశిస్తారు. ప్రేమలు, సంబంధాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ ఆరా తీస్తారు. లంచ్‌.. లాంగ్‌టూర్లు.. పార్టీలు.. ఇలా అన్నింటికీ తొందర పెట్టేస్తుంటారు.
పంచుకోవడం: వాళ్ల జీవితానికి సంబంధించి ప్రతి విషయం, ప్రేమ, పెళ్లి, కెరీర్‌లాంటి వ్యక్తిగత వివరాలు పంచుకుంటారు. అడక్కముందే చిన్నచిన్న పనులు చేసి పెడతారు. మన భావోద్వేగపు పునాదుల మీద దృఢమైన బంధాల్ని అల్లేస్తారు.
తూలనాడే స్వభావం: ఇతరుల ముందే మనల్ని విమర్శిస్తారు. దీన్నే హాస్యమంటారు. మన మనసు గాయపడితే లోలోపల సంతోషిస్తూనే ‘హే.. జస్ట్‌ అయామ్‌ జోకింగ్‌.. డోన్ట్‌ టేకిట్‌ సీరియస్‌ యార్‌’ అని కవర్‌ చేసేస్తారు. వ్యంగ్య వ్యాఖ్యానాల్లో దిట్టలు.
పొగడ్తలుండవు: పరిచయమైన మొదట్లో ప్రతి చిన్నదానికీ పొగడ్తలు కురిపించినవారే తర్వాత మనం మంచి పనిచేసినా, పెద్ద విజయాలు సాధించినా పట్టించుకోరు. నీ విజయం గాలివాటమని తేలిక చేసి మాట్లాడతారు. కనీసం మన ఫేస్‌బుక్‌ ఫొటోకి లైక్‌ కొట్టే, కామెంట్‌ చేసే పెద్ద మనసూ ఉండదు.
ఎగదోసే రకం: స్నేహితుడు ఇబ్బందుల్లో ఉంటే పైకి అయ్యోపాపం అంటున్నా లోలోపల తెగ సంతోషిస్తారు. బంధువులు, స్నేహితులతో గొడవ పడితే సర్దిచెప్పడం మాని ‘నీ గొడవ ఎంతవరకొచ్చింది.. తనతో మాట్లాడకపోతేనే బెటర్‌’ అని బంధాల్ని చీల్చాలని ప్రయత్నిస్తారు.
ఫెయిలైతే సంతోషం: మనం ఎదిగితే సంతోషించేది స్నేహితులు.. అసూయ, ద్వేషం చూపిస్తూ మన పతనాన్ని కోరుకునేది ఫ్రెనెమీ. ఏదైనా పని మొదలుపెడితే సాయం చేస్తున్నట్టు నటిస్తూనే, ఆ పనిలో వైఫల్యం చెందడానికి తెర వెనక ప్రయత్నాలు చేస్తారు.
మనసు నొప్పించడం: లంచ్‌కి రమ్మంటారు. కావాలనే మనకి నచ్చని మెనూ సిద్ధం చేస్తారు. కొత్త హెయిర్‌స్టైల్‌తో వస్తే.. ‘హెయిర్‌ కటింగ్‌ చేయించుకున్నావా?’ అంటారే తప్ప నీ స్టైల్‌ బాగుంది అనరుగాక అనరు.
అంతా మనమంచికే
కాలేజీ, ఆఫీసు.. మరోచోటు.. ఎక్కడైనా ఇలాంటి ఫ్రెనెమీలకు కొదవుండదు. మనపక్కనే ఉంటూ నష్టం చేసేవాళ్లు ప్రమాదకరమే అయినా వాళ్లతో స్నేహం ఒకందుకూ మంచిదే అంటారు ఫ్రొ.శ్రీధర్‌. వాళ్ల సంతోషం కొద్దీ మనల్ని విమర్శిస్తున్నా మన లోపాలేంటో చెప్పకనే చెబుతారు. పరోక్షంగా మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే తపన రగిలిస్తారు. ఒకరి మనసు నొప్పించకుండా ఎలా ఉండాలో వీళ్లని చూసి నేర్చుకోవచ్చు. నిస్సారంగా, చప్పగా సాగిపోతున్న జీవితానికి ఫ్రెనెమీలు తోడైతే కావాల్సినన్ని మలుపులు, నాటకీయత జోడైనట్టే. వారి ప్రతి అడుగునూ సరదాగా తీసుకుంటే ఎంజాయ్‌ చేయాలనుకునేవాళ్లకి ఎంజాయ్‌ చేసినంత. ఏం చేసినా తిట్టడానికో, విమర్శించడానికో వాళ్లు కాచుకొని ఉంటారన్న స్పృహ ఉంటే ముందు జాగ్రత్తగా ఏ తప్పూ చేయకుండా ఉండొచ్చు. ఈ ప్రియమైన శత్రువులు మనకి హాని కలిగించాలని ప్రయత్నిస్తూనే మనని మనం అప్రమత్తంగా ఉండేలా చేస్తారు.

ఉద్యోగాలను సృష్టిస్తాయి.. తీసుకెళ్లవు..! అమెరికా సహా ఏ ఇతర దేశాల్లోనైనా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి గానీ, ...
22/04/2017

ఉద్యోగాలను సృష్టిస్తాయి.. తీసుకెళ్లవు..!

అమెరికా సహా ఏ ఇతర దేశాల్లోనైనా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయి గానీ, తీసుకెళ్లిపోవని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. బెంగళూరులో భారత ఐటీ రంగ ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మల్టీనేషనల్‌ కంపెనీలు పెద్దస్థాయిలో వ్యాపారం చేసి ఉంటే అందులో భారతీయుల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందన్నారు. ఇది పరస్పర అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు. భారతీయ ఐటీ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేదని, ఇప్పుడు ‘డిజిటల్‌ ఇండియా’తో విస్తృత మార్కెట్‌ ఏర్పడిన దృష్ట్యా తిరిగి భారత్‌లో సేవలను విస్తరిస్తున్నాయి అని అన్నారు.
హెచ్‌-1బీ వీసాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. వీసాల జారీ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారిక ఉత్తర్వు కూడా జారీ చేశారు. అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు తన్నుకుపోతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

Address

1st Floor, Syndicate Bank Building, Temple Street, Andhrapradesh
Kakinada
533001

Alerts

Be the first to know and let us send you an email when ssshousings posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ssshousings:

Share