Mutual Funds Ts

Mutual Funds Ts STOCK MARKET INVESTMENTS, MUTUAL FUNDS INVESTMENTS

Join Telegram channel
06/01/2022

Join Telegram channel

Open DEMAT ACCOUNT with below link...
17/12/2021

Open DEMAT ACCOUNT with below link...

Open a Demat Account - Avail hassle free paperless demat account opening online at Upstox with cross trading platform, technology one can trust, easy on the pocket and paperless account opening. Visit now to open demat account Instantly & Trade at lowest flat fee.

https://upstox.com/open-account/?f=VNC3
14/12/2021

https://upstox.com/open-account/?f=VNC3

Open a Demat Account - Avail hassle free paperless demat account opening online at Upstox with cross trading platform, technology one can trust, easy on the pocket and paperless account opening. Visit now to open demat account Instantly & Trade at lowest flat fee.

Join Telegram Channel for Stock Market updates....
13/12/2021

Join Telegram Channel for Stock Market updates....

06/10/2018
13/08/2018

Mutual Funds 8019404575
Mutual funds అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి?
సామాన్య ప్రజలు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును రకరకాల పద్దతుల్లో మదుపు (Invest) చేస్తారు. అందులో కొన్ని…

బంగారం
రియల్ ఎస్టేట్ (ప్లాట్లు, ఇళ్ళు)
షేర్లు (స్టాక్ మార్కెట్)
fixed deposits
చిట్ ఫండ్స్
ఇందులో కొన్ని మార్గాల్లో సంపద చాలా వేగంగా వృద్ధి చెందుతుండగా మరికొన్నింటిలో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని రంగాలు సురక్షితమైనవి కాగా మరికొన్ని రిస్కీగా పరిగణింపబడతాయి. ఒక్కో ఇన్వెస్టర్ యొక్క రిస్కు తీసుకునే స్వభావాన్ని బట్టి, వారి ఆశను బట్టి వారికి నచ్చిన రంగాల్లో invest చేసుకునే అవకాశముంది.

అయితే స్టాక్ మార్కెట్ విషయాన్నే తీసుకుంటే Derivatives (Futures and Options) లాంటి అధిక రిస్కు ఉన్న విషయాలను పక్కనబెడితే, తక్కువ రిస్కు ఉండే ఈక్విటీలలో దీర్ఘకాలిక అవసరాల కోసం invest చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ మార్కెట్ గురించి అవగాహన లేకపోవడం, మట్టిలోమాణిక్యాల వంటి స్టాక్స్ ని వెతికి గుర్తించే నైపుణ్యం, సమయమూ లేకపోవడం వల్ల “ఇది మనవాళ్ళ అయ్యే పని కాదులే” అని మార్కెట్ కి దూరంగా ఉండిపోతారు. దానివల్ల వారికి అందుబాటులోనే ఉన్న ఎన్నో అద్బుతమైన అవకాశాలను కోల్పోయినవారవుతారు.

ఇలాంటివారి కోసమే ఏర్పడిన సంస్థలు mutual funds.

mutual funds లలో ఎవరైనా తమ వద్దనున్న సొమ్ముని invest చేయవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఈ mutual funds సంస్థలు రకరకాల మార్గాల్లో, రంగాలలో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్నిసార్లు సురక్షితమైన రంగాలలో, కొన్నిసార్లు కాస్త రిస్కు ఉన్న రంగాలలో కూడా invest చేయడం జరుగుతుంది. ఎలాంటి రంగాలలో పెట్టుబడి పెడతారన్న విషయం ముందుగానే తెలపడం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన mutual fund నే ఎంచుకోవచ్చు.

ఇక ఈ funds నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి మంచి అవగాహన కలిగిన, అపార అనుభవం ఉన్న fund managers నే ఈ సంస్థలు నియమించుకోవడం జరుగుతుంది. Fund managers చేసే ఏ ఒక్క పొరపాటయినా కూడా సంస్థకి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రమాదముంది కాబట్టి mutual fund సంస్థలు ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా performance కలవారినే నియమించుకుంటాయి. ఈ fund managers నిరంతరం తమ Portfolio (మదుపు చేసిన అంశాలు/ stocks) ని పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, సమయాన్ని బట్టి తమవద్దనున్న stocks అమ్మేయడం, తిరిగి కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఇన్వెస్టర్ల సొమ్ముని పెట్టుబడిగా పెట్టి, వాటి ద్వారా వచ్చిన లాభాలలో కొంతవాటా ఇన్వెస్టర్లకి అందజేస్తూ, నిర్వహణ ఖర్చుల క్రింద తమవంతుగా ఈ fund managers కొంత స్వీకరించడం చేస్తాయి. ఇదీ fund managers చేసే పని.

1963లో యూనిట్ ట్రస్ట్ అఫ్ ఇండియా స్థాపన భారత దేశంలో mutual funds కి నాంది పలికింది. 1993లో ప్రైవేటు రంగ సంస్థలకి కూడా అనుమతి మంజూరు చేయడం జరిగింది. 2013 నాటికి దేశంలో ఉన్న mutual funds సంస్థల సంఖ్య 46. ఈ mutual funds ల వ్యాపారాన్ని SEBI (Securities and Exchange Board of India) నియంత్రిస్తుంది.

Mutual fund వల్ల ప్రయోజనాలు:

1.ఇందులో మీకు తోచిన మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. భారీస్థాయిలో సొమ్ము ఉంటేనే mutual fundలో పెట్టుబడికి అవకాశం ఉంటుందనేది ఒక పొరపాటు. మీవద్ద 500 రూపాయలు ఉన్నా కూడా mutual fundలో invest చేయవచ్చు.

2.ప్రొఫెషనల్ fund managerల సేవలు పొందవచ్చు: మంచి అనుభవం, నైపుణ్యంగల వీరు, qualified research team ని కలిగి ఉండి, ఎల్లప్పుడూ మంచి పెట్టుబడి అవకాశాలకోసం అన్వేషిస్తూ, మీ సొమ్ముని రెట్టింపు చేయడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మీ కష్టార్జితాన్ని ఎలా వృద్ధి చేయాలా అని మీరు బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీరి చేతుల్లో ఉంచి నిశ్చింతగా ఉండవచ్చు.

3.Diversification: సోమ్మునంతటినీ ఏదో ఒక్క రంగంలోనే పెట్టుబడిగా ఉంచితే దురదృష్టవశాత్తూ ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఆ రంగానికి దెబ్బ తగిలినట్లయితే ఇన్వెస్టర్ల కష్టార్జితమంతా ఆవిరయిపోయే ప్రమాదముంది అందుకే fund managerలు వేర్వేరు రంగాలలో invest చేయడానికి (diversification) అవకాశముంది. దీనివల్ల ఒక రంగంలో వచ్చిన నష్టాలను మరో రంగంలోని లాభాలతో కవర్ చేసే అవకాశముంది. Diversification అంటే ఇష్టంలేని ఇన్వెస్టర్లకి కోసం non-diversified funds కూడా లభిస్తున్నాయి, ఇక ఇన్వెస్టర్ల ఇష్టం, ఏదైనా ఎంచుకోవచ్చు.

4.సులభం: పదేపదే బ్రోకర్ కి phone చేయాల్సిరావడం ఉండదు. ప్రతీరోజూ పేపర్లో మీ stocks ధర పెరిగిందా తగ్గిందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి invest చేస్తే మళ్ళీ బ్రోకర్ మొహం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ కంప్యూటర్ పై కూర్చుని ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనుంచే onlineలో mutual fundలో invest చేయవచ్చు. జస్ట్ మీ వద్ద మొబైల్ ఉంటే చాలు మీ mutual fund site కి వెళ్లి మీ పెట్టుబడి యొక్క ఆరోజు విలువ (NAV- Net Asset Value) తెలుసుకోవచ్చు. ఇది రెండు నిముషాల పని. ఒకవేళ మీ investment వృద్ధి చెందిన తరువాత ఇక చాలు అనుకుంటే వెంటనే అమ్మివేయవచ్చు. Net Asset Valueని బట్టి మీకు ఎంత సొమ్ము చెల్లించబడుతుందో సులభంగా చెప్పగలం.

మొత్తం మీద స్టాక్ మార్కెట్ పై సమగ్ర అవగాహన్ లేని ఓ సామాన్యుడికి invest చేయడానికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి ఈ mutual funds.

15/06/2018

MUTUAL FUNDS
8019404575

ఈక్విటీ ఫండ్స్‌ల్లో రూ.70,000 కోట్లు
‘సిప్‌’ల జోరు
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ.70,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు 41 శాతం పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో నికర పెట్టుబడులు రావడం ఇది వరుసగా మూడో ఏడాది. రిటైల్‌ ఇన్వెస్టర్ల సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు, ఈక్విటీ ఫండ్స్‌ మంచి రాబడులనివ్వడం, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ చర్యలు తీసుకోవడం తదితర చర్యల కారణంగా ఈక్విటీ ఫం‍డ్స్‌ల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు.

నెలకు రూ.4,000 కోట్లు

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు గత ఏడాది నెలకు 1.3 కోట్ల సిప్‌ల ద్వారా రూ.4,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ వృద్ధి జోరుగా ఉందని ఫండ్స్‌ఇండియాడాట్‌కామ్‌ సీఓఓ శ్రీకాంత్‌ మీనాక్షి చెప్పారు. భారత ఇన్వెస్టర్లు షేర్లను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.
అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫి) గణాంకాల ప్రకారం, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)తో సహా ఈక్విటీ ఫండ్స్‌లో గత ఆర్థిక సంవత్సరంలో రూ.70,367 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. . ఈక్విటీ ఫండ్స్‌లో రూ.71,029 కోట్ల నికర పెట్టుబడులు రాగా , గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, ఈక్విటీ-లిం‍క్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫం‍డ్స్‌ కేటగిరీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల ఖాతాలు పెరిగాయి. ఈ కేటగిరిలో వచ్చిన 58 లక్షల రిటైల్‌ ఇన్వెస్టర్ల ఖాతాలతో మొత్తం ఖాతాల సంఖ్య 4.4 కోట్లకు ఎగసింది. గత ఏడాది మార్చి నాటికి 3.86 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.5.43 లక్షల కోట్లకు పెరిగాయి.

MUTUAL FUNDS
8019404575

12/06/2018

MUTUAL FUNDS
8019404575
‘సిప్‌’ చేయండి మంచి కాఫీలా
క్ర‌మానుగ‌తంగా పెట్టుబ‌డి(సిప్‌) చేసే విధానంలో ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు ఏ విధంగా ఉప‌క‌రిస్తాయో చూద్దాం.

కిరణ్‌, రవి మంచి మిత్రులు. పన్ను ప్రణాళికలో మారిన నిబంధనల గురించి వివరంగా తెలుసుకునేందుకు రవి ఓ రోజు ఉదయం కిరణ్‌కు ఫోన్‌ చేస్తాడు. పొదుపు చేసేందుకు రవి చాలా సంప్రదాయ మర్గాలను అనుసరిస్తాడు. పోస్టాఫీసు జాతీయ పొదుపు పత్రాలు, ఎల్‌ఐసీ ఎండోమెంట్‌ పథకాలు, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటి పూర్తి సురక్షితమైన పథకాలవైపే అతడు మొగ్గుచూపుతాడు.

పన్ను ప్రణాళిక గురించి చర్చించేందుకు కిరణ్‌ రవిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఓ రోజు సాయంత్రం కిరణ్‌ ఇంటికి రవి వెళతాడు. రవిని కూర్చోబెట్టి ఇద్దరికీ కాఫీ తీసుకురమ్మని తన భార్యకు చెబుతాడు. ఇద్దరి మధ్య మాటలు మొదలవుతాయి.

‘‘ సెక్షన్‌ 80 సీ ప్రకారం రూ. 1.5 లక్షల పరిమితితో ఏ విధంగా ప‌న్ను ఆదా కోసం వెచ్చించావు.’’ అని రవిని కిరణ్‌ అడుగుతాడు. అందుకు రవి చిన్నగా నవ్వి … ‘‘ నాకు సరైన మార్గనిర్దేశం లేక అప్పటికప్పుడు చేశాను. వాళ్లు ఇచ్చిన సలహాలు పాటించాక గానీ అర్థం కాలేదు. అయితే ఎక్కువ కమిషన్‌తో ఉన్నవి లేకపోతే తక్కువ రాబడిని ఇచ్చేవిగా ఉన్నాయి. అసంతృప్తి చెందాల్సిన మరో విషయమేమిటంటే దాదాపు అవన్నీ ఆర్థిక సంవత్సరం చివర్లో హడావిడిగా చేసినవే’’.
ఈ సంభాషణ ఇలా సాగుతుండగానే, వేడి వేడి కాఫీ వస్తుంది. నిదానంగా తాగి రిలాక్స్‌ అవ్వమని కిరణ్‌ అంటాడు.

ఈక్విటీల్లో ఇంత వరకు పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో పొదుపు చేయాల్సిందిగా కిరణ్‌ సూచిస్తాడు. అందుకు రవి అంగీకరిస్తాడు కానీ ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు. సంభాషణ కొనసాగిస్తూ కమ్మని కాఫీ రుచిని ఇద్దరూ ఆస్వాదిస్తుంటారు.

కిరణ్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాన్ని వివరించేందుకు దాన్ని కాఫీతో పోలుస్తాడు. ‘‘ ఈఎల్‌ఎస్‌ఎస్‌ వేడి కాఫీ లాంటిది. దీన్ని ఒకే గుటకలో తాగకూడదు (నష్టభయంతో సమానం). అసలైన ఆస్వాదం, రుచి (రాబడులు) రావాలంటే మెల్లమెల్లగా తాగాలి (నష్టభయాన్ని సమాంతరం చేయడం).

ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు అంటే…
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు నిర్వహించే డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇవి. క్యాపిటల్‌ వృద్ధి దిశగా ఈ ఫండ్లు పనిచేస్తాయి. వైవిధ్యమైన షేర్లలో పెట్టుబడి పెడతారు. పథకంలోని మొత్తం సొమ్ము ఈక్విటీల్లో పెడతారు లేదా కొంత మొత్తాన్ని డెట్‌, మనీ మార్కెట్‌ సాధనాల్లో పెడతారు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు కేవలం మూడేళ్ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌తో వస్తాయి. వడ్డీ మినహాయింపు పథకాల్లో అన్నింటికంటే తక్కువ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉన్నది దీనికే.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 80 సీ లాభాలు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకానికి వర్తిస్తాయి. ఈక్విటీ ఆధారిత పథకాలు ఒడిదొడుకులకు ఎక్కువగా లోనవుతాయి. అంతేకాకుండా రాబడిని అంచనా వేయలేం. అయితే క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా ఒడిదొడుకులను సమాంతరం చేయవచ్చు. ఇతర సంప్రదాయ మార్గాలతో పోల్చి చూస్తే సిప్‌ ద్వారా చేసినవాటికి అధిక రాబడి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

రవి విషయాన్నే పరిశీలిస్తే కాలవ్యవధి 10ఏళ్లు ఉన్నందుకు… సిప్‌ విధానం ద్వారా నెలకు రూ.4,200 (ఏడాదికి 50వేలు) ఏదైనా ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకంలో పెట్టుబడి పెట్టినట్టయితే 12శాతం వడ్డీ పరిగణనలోకి తీసుకున్నట్టయితే పదేళ్లకు జమ అయ్యే సొమ్ము రూ.10లక్షలకు పైనే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇంకా చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే ఈ రాబడులు ద్రవ్యోల్బణాన్ని గట్టిగా ఎదుర్కోవడమే కాదు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

సిప్‌ విధానమే ఎందుకు పాటించాలి?
సిప్‌ క్రమశిక్షణను, సౌలభ్యతను కల్పిస్తుంది.
క్రమశిక్షణ అంటే సమయానికి నిర్ధుష్ట పెట్టుబడి చేయగలగడం
సౌలభ్యత అంటే చిన్నమొత్తాలు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలత ఉండడం.
రూపాయి సగటు విలువ, చక్రవడ్డీ ప్రభావం సిప్‌ పై ఉంటుంది.
రూపాయి సగటు విలువ ప్రభావం ప్రకారం ధర తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు వస్తాయి. ధర ఎక్కువగా ఉంటే యూనిట్లు తక్కువగా వస్తాయి.
చక్రవడ్డీ సూత్రం ప్రకారం పెట్టుబడి కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ రాబడి చేతికందుతుంది.
మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడిని చివరి దాకా కొనసాగించి మంచి లాభాలను అందుకోండి.
సిప్‌ విధానం ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ బాగా పనిచేస్తుంది.
సిప్‌

See Translation

11/06/2018

MUTUAL FUNDS
8019404575
షేర్ vs యూనిట్
వివిధ కంపెనీల‌కు చెందిన‌ షేర్ల‌లో పెట్టుబ‌డికి, మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు జారీచేసే యూనిట్ల‌లో పెట్టుబ‌డికి మ‌ధ్య తేడా ఏంటో చూద్దాం

యూనిట్ :
మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ఏదైనా ఒక‌ ప‌థ‌కం ద్వారా మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ పెట్టుడుల్లో మ‌దుపు చేసి వాటి ద్వారా వ‌చ్చిన లాభాన్ని మ‌దుప‌ర్ల‌కు వారి కున్న వాటా ఆధారంగా పంచుతారు. ఇది మ్యూచువ‌ల్ ఫండ్ చేసే ప్ర‌ధాన విధి. దీంట్లో వాటా కొనుగోలు చేయాలంటే ఆ ఫండ్ ఆఫ‌ర్ స‌మ‌యంలో, ఓపెన్ ఎండెడ్ ఫండ్ల‌యితే సంస్థ‌ల నుంచి ఎప్పుడైనా లేదా క్లోజ్ ఎండెడ్ ఫండ్ల‌యితే ఎక్స్ఛేంజీ ద్వారా లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ లో వాటాని యూనిట్ అంటారు.

షేర్ :
స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఎక్కువ‌గా వినిపించే ప‌దం షేర్. కంపెనీలో వాటా అని అర్థం. ఆ కంపెనీ ప‌రిమాణం, వ్యాపారం బ‌ట్టి షేరు ధ‌ర, షేర్ల సంఖ్య ఉంటుంది. ఏదైనా కంపెనీలో వాటాను లెక్కించేందుకు షేర్ అనేది ఒక ప్రామాణికం. షేర్ల‌లో పెట్టుబ‌డి చేయాలంటే ఆ సంస్థ ప‌బ్లిక్ ఆఫ‌ర్ కు వ‌చ్చిన స‌మ‌యంలోనో లేదా ఎక్స్ఛేంజీ ద్వారా క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌వ‌చ్చు.

షేర్ కు… యూనిట్ కు…
ఏదైనా కంపెనీలో నేరుగా వాటా క‌లిగి ఉండే వారిని షేర్ హోల్డ‌ర్లు అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ లో వాటా క‌లిగి ఉండే వారిని యూనిట్ హోల్డ‌ర్లు అంటారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిందేంటంటే, మ్యూచువ‌ల్ ఫండ్లు వివిధ‌ కంపెనీల షేర్ల‌లో మ‌దుపుచేస్తాయి. ఈక్విటీ ఫండ్ల‌యితే ప్ర‌ధానంగా వాటిలోనే మ‌దుపు చేస్తాయి. ఆ లెక్క‌లో ప‌రోక్షంగా యూనిట్ల‌లో పెట్టుబ‌డి కంపెనీల‌ షేర్ల‌లోకి వెళ్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ‌కు కొంత శాతం ఫీజును తీసుకుంటారు. దాన్నే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు.
మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు ఫీజు చెల్లించే బ‌దులు నేరుగా షేర్ల‌లోనే మ‌దుపు చేయోచ్చు క‌దా ? ఏ ఫీజులు చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని అనిపించొచ్చు అయితే దానికి మార్కెట్ల‌పై అవ‌గాహ‌న చాలా అవ‌స‌రం. స్వ‌ల్ప ప‌రిజ్ఙానంతో స్టాక్ మార్కెట్‌లో మ‌దుపుచేయ‌డం అంత మంచిది కాదు. కాబ‌ట్టి ఈక్విటీలో పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభించే వారు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం శ్రేయ‌స్క‌రం. పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చిన త‌ర్వాత నేరుగా షేర్ల‌లో మ‌దుపుచేసినా ఫ‌ర్వాలేదు.

ఫండ్లు, షేర్ల‌లో పెట్టుబ‌డికి తేడాలు:
మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా త‌క్కువ మొత్తంతో ఎక్కువ కంపెనీల్లో మ‌దుపు చేసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డుల‌ను ప‌ర్య‌వేక్షించే ఫండ్ మేనేజ‌ర్లు ఉంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోలో ఉన్న వివిధ ర‌కాల కంపెనీల‌కు చెందిన షేర్లు అన్నీ ఒకే విధంగా ఉండ‌వు. కొన్ని రాణిస్తే కొన్ని రాణించ‌క‌పోవ‌చ్చు. ఆ స‌మ‌యంలో పెట్టుబ‌డి బ్యాలెన్స్ అవుతుంది. షేర్ల‌లో పెట్టుబ‌డి చేస్తే చిన్న మ‌దుప‌ర్లకు త‌మ వ‌ద్ద ఉన్నమ‌దుపుతో ఎక్కువ కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డి చేయడం సుల‌భం కాదు.

మ‌దుప‌రి రూ.5 వేల‌తో మ్యూచువ‌ల్ ఫండ్లో పెట్టుబ‌డి చేస్తే దాదాపు 30-50 కంపెనీల్లో పెట్టుబ‌డి స‌ర్దుబాటు అవుతుంది. అదే రూ. 5 వేల‌తో అన్ని కంపెనీల‌కు చెందిన షేర్లలో పెట్టుబ‌డి చేయ‌డం వీలు కాదు. ఎక్కువ‌ కంపెనీల్లో కొంచెం కొంచెం మ‌దుపు చేయ‌డం వ‌ల్ల పెట్టుబ‌డుల‌కు వైవిధ్య‌త తోడ‌వుతుంది. పెట్టుబ‌డి చేసిన అన్ని షేర్లు ఒకే సారి న‌ష్టపోవు అనే ఒక లాజిక్ ఇక్క‌డ ఉంది. షేర్లలో పెట్టుబ‌డి చేసే ఒక‌టిరెండు కంపెనీలు న‌ష్టాల్లోకి రావ‌డానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా లాభాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం (రిస్క్) vs రాబ‌డి (రిట‌ర్న్) :
రిస్క్ ఎక్కువ ఉన్న పెట్టుబ‌డులు రాబ‌డి కూడా ఎక్కువ‌గా ఇస్తుంటాయి. షేర్ల‌లో పెట్టుబ‌డికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఒక ప‌ద్ధ‌తిలో పెట్టుబ‌డి చేసుకోవాల‌ని అనుకుంటే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది.

MUTUAL FUND INVESTMENTS
CALL 8019404575

Address

Hyderabad
500079

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm

Telephone

8019404575

Website

Alerts

Be the first to know and let us send you an email when Mutual Funds Ts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mutual Funds Ts:

Share