profityourtrade.in

profityourtrade.in Profit your trade.in is the first and only Telugu financial portal run by stock market experts and finance professionals.

Visitors to the portal get latest stock market updates, corporate news, analysis of IPOs, business happenings in Telangana and Hyderabad and much more. Profityourtrade.in has a growing viewership from Telugu people worldwide and is committed to constantly launch innovative content and features to ensure an optimal one-stop source for financial news and views.

20/12/2020

రిలయన్స్ కు మరో జాక్ పాట్!: కేజీ బేసిన్ లో R క్లస్టర్ నుంచి గ్యాస్ ఉత్పత్తి BPతో కలిసి ఉత్పత్తి ప్రారంభించనున్న రిలయెన్స్ 2023 నుంచి మూడు క్షేత్రాల్లోనూ చమురు వెలికితీత రిలయెన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక ఘట్టానికి చేరువైంది. కృష్ణా గోదావరి బేసిన్ లో అత్యంత లోతైన ఆర్ క్లస్టర్ నుంచి గ్యాస్ ను వెలికి తీసేందుకు సిద్ధమవుతోంది. ఆసియాలో ఇదే అతి లోతైన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్. సుమారు 2వేల మీటర్ల లోతు నుంచి గ్యాస్ ని వెలికి తీయాల్సి ఉంటుంది. 2021లో రోజుకు 12.9 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల చొప్పున ఉత్పత్తి చేసే సత్తా కలిగి ఉంటుంది. రిలయెన్స్, బీపీ ఇవాళ కీలక ప్రకటన చేశాయి. కేజీ డి6 బేసిన్ లోని ఆర్ క్లస్టర్ నుంచి గ్యాస్ వెలికి తీసేందుకు సంయుక్తంగా పనిచేయనున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి. రెండు సంస్థలు కలిసి 3 క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీయాలని నిర్ణయించగా.. ఆర్ క్లస్టర్ అందులో మొదటిది. శాటిలైట్స్ క్లస్టర్, MJ క్లస్టర్ నుంచి కూడా తర్వాత దశల్లో గ్యాస్ ను వెలికి తీయనున్నాయి. 2023 నాటికి భారత్ లోని 15శాతం గ్యాస్ అవసరాలను ఈ క్షేత్రాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నట్టు రెండు సంస్థలు ప్రకటించాయి.. KG బేసిన్ లో రిలయెన్స్ కు 66.67శాతం, BPకి 33.33శాతం వాటా కలిగి ఉన్నాయి. అత్యంత క్లిష్టమయిన భౌగోళిక పరిస్థితులు ఉండే కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ను వెలికి తీసేందుకు BPతో కలిసి పని చేస్తుండడం సంతోషంగా ఉందని రిలయెన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. పెరుగుతున్న భారతీయ అవసరాలను రెండు కంపెనీలు కలిసి తీరుస్తాయనే నమ్మకాన్ని వెలిబుచ్చారు BP సీఈఓ బెర్నార్డ్ లూనే. శాటిలైట్ క్లస్టర్ 2021లో, MJ క్లస్టర్ 2022లో అందుబాటులోకి వస్తుందని అంచనా వసే్తున్నారు. ఈ మూడు క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలైతే రోజుకు 30 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల చొప్పున వెలికి తీయవచ్చని ఆశిస్తున్నారు. అదే జరిగితే 25 శాతం దేశీయ అవసరాలను తీర్చవచ్చని భావిస్తున్నారు. అప్పుడు చమురుకోసం విదేశాలపై ఆధారపడడం భారీగా తగ్గుతుంది.

20/12/2020

యూఎస్ కంపెనీలో వాటా విక్రయించిన ఇన్ఫోసిస్: యూఎస్ కంపెనీలో వాటా విక్రయించిన ఇన్ ఫోసిస్ అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ WHOOPలో 2015లో 3 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది ఇన్ఫోసిస్ కంపెనీ. వేరబుల్ డివైస్ స్టార్టప్ ఇది. మైనార్టీ స్టేక్ తీసుకుంది. ఇదే కంపెనీలో తనకున్న వాటాను విక్రయిస్తోంది ఇన్ ఫోసిస్. ప్రస్తుతం కంపెనీలో ఉన్నవాటాను 10 మిలియన్ డాలర్లకు విక్రయిస్తోంది. అంటే రూ.73.5 కోట్లు. బోస్టన్ లో ఉన్న కంపెనీలో వాటా విక్రయిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

19/12/2020

మిసెస్ బెక్టార్ 5ఏళ్లలో రెండో కంపెనీ: మిసెస్ బెక్టార్ 5ఏళ్లలో రెండో కంపెనీ IPOలో సరికొత్త రికార్డు లిస్టింగ్ రోజు ఎంత వస్తుందో? బిస్కెట్ మరియు బేకరీ ఉత్పత్తుల కంపెనీ మిసెస్ బెక్టార్స్ ఫుడ్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. గడిచిన 5 ఏళ్లలో అత్యధికంగా సబ్ స్క్రైబ్ అయిన కంపెనీలో రెండోదిగా నిలిచింది. కంపెనీ రూ.540.54 కోట్లు లక్ష్యంగా IPOకు వచ్చింది. కానీ కంపెనీకి అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 198.02 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. డిసెంబర్ 15 నుంచి 17మధ్య IPOకు వచ్చింది. గడిచిన ఐదేళ్లలో కనీసం రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువతో IPOకు వచ్చిన కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇందులో 2018లో అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ 156 కోట్లకు IPOకు వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ 248.51 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. తర్వాత మళ్లీ మిసెస్ బెక్టార్ రెండోస్థానంలో నిలిచింది. IPOకు అధ్బుతమైన స్పందన వచ్చింది. ఇక లిస్టింగ్ కూడా మరెన్ని రికార్డులు స్రుష్టిస్తుందో చూడాలి. ఇటీవలే వచ్చిన ఫుడ్ కంపెనీ కూడా భారీగానే లిస్ట్ అయింది. ఒక్కరోజులోనే దాదాపు షేర్ ప్రైస్ డబుల్ అయింది. మరి మిసెస్ బెక్టార్ ఎంతవుతుందో చూద్దాం..

19/12/2020

మెరుపు తగ్గిన మెటల్స్‌: గత కొన్ని రోజులుగా జోరుమీదున్న మెటల్‌ ఇండెక్స్‌ ఇవాళ లాభాల స్వీకరణకు గురవుతోంది. దీంతో ఇవాళ మెటల్స్ ఇండెక్స్‌ ఒకశాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌ నష్టాలను వెల్‌స్పన్‌ కార్ప్‌, ఏపీఎల్‌ అపోలో, నాల్కోలు లీడ్‌ చేస్తున్నాయి. అయితే హిందాల్కో, మిధాని, రత్నమణి మెటల్స్‌కు మాత్రం కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది.

19/12/2020

52 వారాల గరిష్టానికి టీసీఎస్‌: బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభం కావడంతో ఇవాళ టీసీఎస్‌ పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో షేర్‌ 2శాతం పైగా లాభపడి డే గరిష్ట స్థాయి రూ.2894కు చేరింది. ప్రస్తుతం ఒకటిన్నర శాతం లాభంతో రూ.2877.20 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 12.55 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10,80,349 కోట్లకు ఎగబాకింది. బైబ్యాక్‌ ఆఫర్‌లో భాగంగా 5,33,33,333 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలని టీసీఎస్‌ నిర్ణయించింది. ఒక్కో షేరు రూ.3వేల చొప్పున బైబ్యాక్‌ చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇవాళ ప్రారంభమైన ఈ బైబ్యాక్‌, జనవరి 1న ముగియనుంది. మే 2017, ఆగస్ట్‌ 2018 తర్వాత టీసీఎస్‌కు ఇది మూడో బైబ్యాక్‌ ఆఫర్‌ కావడం విశేషం. ప్రస్తుత లెవెల్స్‌లో ఏడాది కాలపరిమితితో ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి హోల్డ్‌ చేయాలని, చక్కని రిటర్న్స్‌ పొందే అవకాశముందని మార్కెట్‌ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. Disclaimer : ఇవి రీసెర్చ్‌ సంస్థలు, మార్కెట్ నిపుణుల వ్యక్తిగత రికమండేషన్స్ మాత్రమే. profityourtrade.in వెబ్‌సైట్‌కు వీటితో ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

18/12/2020

హైదరాబాద్ కు ఆటో టెక్ కంపెనీ: హైదరాబాద్ కు ఆటో టెక్ కంపెనీ వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్ ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకి అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్లలో ఒకటిగా మారనుంది. ఇందుకోసం కంపెనీ రూ.1,050 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. 2021 చివరి నాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లోని దాదాపు 1,000 మంది నిపుణులకు ప్రారంభం కానుంది. ముంబై ప్రధాన కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎఫ్‌సీఏకు మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో వెహికిల్, పవర్‌ట్రైన్‌ తయారీ సంయుక్త సంస్థ ఉంది. పుణె, చెన్నైల్లో ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కనెక్టెడ్‌ వెహికల్‌ ప్రోగ్రామ్స్‌, పాసింజర్‌ సేఫ్టీ, డిజిటల్‌ షోరూమ్‌లు, ఏఐ, డేటా యాసిలిరేటర్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి వాటిపై ఇక్కడ పరిశోధనలు చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో హుండయ్ కంపెనీకి చెందిన పరిశోధనా సంస్థ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్టోరేజీ వ్యవస్థల పాలసీని విడుదల చేసింది. ఎఫ్‌సీఏ కూడా హైదరాబాద్‌లో విడి భాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. ఎఫ్‌సీఏ హైదరాబాద్‌ను ఎంచుకుని సరైన నిర్ణయం తీసుకుందన్నారు.

18/12/2020

ఒక్కరోజులోనే 3వేల డాలర్లకు పైగా పెరిగిన బిట్ కాయన్: ఒక్కరోజులోనే 3వేల డాలర్లకు పైగా పెరిగిన బిట్ కాయన్ 23వేల డాలర్లు దాటిన ప్రైస్ క్రిప్టో కరెన్సీ దూకుడు కొనసాగుతుంది. తొలిసారిగా బుధవారం 20వేల డాలర్లకు టచ్ అయిన బిట్ కాయన్.. ఏకంగా తెల్లారి గురువారం 23వేల 770 డాలర్లకు చేరింది. ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపడంలో ధర అమాంతం పెరిగింది. హయ్యర్ రిటర్న్స్ ఆశిస్తున్న ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో భారీగా పెరుగుతుంది. గురువారం సరికొత్త రికార్డు స్థాయి మార్కును అందుకుంది. 24 గంటల్లోనే దాదాపు 15శాతం పెరిగింది. వారంలో 26శాతం పెరిగింది. నెలలో 28శాతం గెయిన్ అయింది. గడిచిన ఏడాదిలో 250శాతం పెరిగింది. 2019 డిసెంబర్ 18న బిట్ కాయన్ ధర 6584 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఇది 23441 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే ఏడాదిలో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

18/12/2020

2021లోనూ మార్కెట్లో పరుగులే: 2021లోనూ మార్కెట్లో పరుగులే ఇన్వెస్టర్లకు సరైన సమయయా? దేశీయ మార్కెట్లో ఈక్విటీ స్టాక్స్ లో వచ్చే ఏడాది అంటే 2021లో బుల్ జోష్ కొనసాగుతుందంటోంది ప్రముఖ బ్రోకరేజి సంస్థ క్రెడిట్ ష్యూసి. హై సింగిల్ డిజిట్.. లో డబుల్ డిజిట్ మధ్య గ్రోత్ ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ చూసుకుంటే మార్కెట్ 13శాతం వరకూ గెయిన్ అయింది. ప్రైస్ టు ఎర్నింగ్ కూడా యావరేజ్ 20శాతం వరకూ ఉంది. వచ్చే ఏడాది కూడా ఇదేస్థాయిలో ఉంటుందని భావిస్తోంది. సమీప భవిష్యత్తులో మార్కెట్ కరెక్షన్ కనిపించడం లేదని.. షేర్లు తక్కువ ధరకు ఆశించడం అత్యాశే అవుతుందని చెబుతోంది. కార్పొరేట్ ఏర్పింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. దీంతో పాటు ఎకానమీ రికవరీ వేగంగా అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో షార్ప్ ఫాల్ ఛాన్స్ ఊహించలేమంటున్నారు. 2023 EPS కూడా అప్ గ్రేడ్ చేసింది సంస్థ. ఇదే కాదు.. జాతీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అన్నీ కూడా ఇండియన్ మార్కెట్లపై పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నాయి. ఎమెర్జింగ్ మార్కెట్లలో బెస్ట్ ఛాయిస్ అంటున్నాయి. వచ్చే ఏడాది మార్కెట్లో భారీ ర్యాలీ కొనసాగుతుందని.. ఇప్పట్లో కరెక్షన్ ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న గ్రోత్ కొనసాగుతుందని ఇన్వెస్టర్లు బుల్ పరుగులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇన్వెస్టర్లు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయవచ్చని సలహా ఇస్తున్నారు. సో.. డోన్ట్ వేస్ట్ టైం.. ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ విత్ స్మార్ట్ ఛాయిస్.

17/12/2020

IPOతో వచ్చి హిట్టైన కంపెనీలు తెలుసా?: IPOతో వచ్చి హిట్టైన కంపెనీలు ఏంటో తెలుసా? 2021లో రూ.30వేల కోట్లు సమీకరణ లిస్టింగ్ డే నాడే 50శాతం పెరిగిన 5 కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం IPOల సీజన్ నడుస్తోంది. 2020లో కొద్ది నెలల గ్యాప్ లోనే IPOల ద్వారా సుమారు రూ.30వేల కోట్లు సమీకరించాయి కంపెనీలు. ఒకటీ అర తప్ప దాదాపు అన్నీ మార్కెట్లో సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని కంపెనీలు అయితే లిస్టింగ్ నాడే దాదాపు స్టాక్ ప్రైస్ 50శాతం అంతకంటే ఎక్కువే గెయిన్ అయ్యాయి కూడా. రెండు కంపెనీలు షేర్లు ఏకంగా డబుల్ అయ్యాయి. డిసెంబర్ 14న లిస్టింగ్ అయిన బర్గర్ కింగ్ కంపెనీ స్టాక్ లిస్టింగ్ ప్రైస్ రూ.60 కాగా.. అదే రోజు ఏకంగా 138.40 వద్ద క్లోజ్ అయింది. అంటే 131శాతం గెయిన్ అయింది. హ్యాపీయిస్ట్ మైండ్స్ టెక్నాలజీది కూడా సక్సెస్ ఫుల్ IPOగా నిలిచిపోతుంది. సెప్టెంబర్ 17న మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ స్టాక్ ప్రైస్ రూ.166 ఫిక్స్ చేస్తే.. ఏకంగా అదే రోజు 123శాతం పెరిగి రూ.371వద్ద క్లోజ్ అయింది. రూట్ మొబైల్ కంపెనీ కూడా సెప్టెంబర్ 21న వచ్చింది. ప్రైస్ రూ. 350 వద్ద లిస్టింగ్ కు రాగా.. 86శాతం పెరిగి 651 వద్ద ముగిసింది. రోజరీ బయోటెక్ కంపెనీ జులై 23న మార్కెట్లో లిస్ట్ అయింది. కంపెనీ స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.425 కాగా.. 75శాతం పెరిగి రూ.742 వద్ద ముగిసింది. కెమ్ కాన్ స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ కంపెనీ అక్టోబర్1న మార్కెట్లో లిస్ట్ అయింది. కంపెనీ స్టాక్ ప్రైస్ 340వద్ద ఫిక్స్ చేశారు. లిస్టింగ్ డే నాడు 72శాతం పెరిగి 584 వద్ద ట్రేడ్ అయింది.

17/12/2020

2020 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కలిసిరాలేదా?: 2020 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కలిసిరాలేదా? 2021లో ఈ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రైవేటు రంగంలో ఈక్విటీ మార్కెట్లో తలపడతాయా? ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్ స్టోరీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ విభాగంలో ఈ ఏడాది పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ షేర్లు ఇన్వెస్టర్లకు పెద్దగా కలిసిరాలేదని చెప్పవచ్చు. డిసెంబర్ 15 క్లోజింగ్ సమయానికి సరిగ్గా ఈ ఏడాదిలో నిఫ్టీ 12శాతం గెయిన్ అయితే.. PSU సూచీలు 27శాతం ఇంకా వెనకబడి ఉన్నాయి. PSUబ్యాంకింగ్ మాత్రమే కాదు.. ఈ విభాగంలో అన్ని కూడా కోవిడ్ కారణంగా చాలావరకు అనిశ్చితి పరిస్థితులు చవిచూశాయి. అయితే ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు సెకండ్ హాఫ్ లో కాస్త మెరుగ్గా కనిపించాయి. స్టాక్స్ వాల్యూస్ పెరిగాయి. అసలు కారణం ఇదే... వాస్తవానికి బ్యాంకులు పెండమిక్ నుంచి బయటపడకముందే ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల గోరు చుట్టూ రోకటిపోటులా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రుణభారం పెరిగింది. MSMEలతో పాటు.. పారిశ్రామిక రంగాలకు భారీగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే NPAలు ఉండగా.. మళ్లీ రీషెడ్యూల్, మారిటోరియం వంటివి ఇబ్బందిగా మారాయి. ఇదంతా ఇన్వెస్టర్లకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లకు ముఖం చాటేసేలా చేశాయి. ఇదే ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పెరగకపోవడానికి కారణమైంది. ఆయా కారణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు ఒత్తిడిలో ఉంటే.. అదే సమయంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం ప్రీకోవిడ్ లెవల్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇయర్ టు డేట్ చూస్తే... ఏడాది క్రితం స్టాక్ ప్రైస్ తో పోల్చితే సెంట్రల్ బ్యాంక్ మైనస్ 37, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైనస్ 39, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మైనస్ 37, బ్యాంక్ ఆఫ్ బరోడా మైనస్ 34, బ్యాంక్ ఆఫ్ ఇండియా మైనస్ 26, యూకో బ్యాంక్ మైనస్ 21, జేకే బ్యాంక్ మైనస్ 19, SBI మైనస్ 19, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైనస్ 18, ఇండియన్ బ్యాంక్ మైనస్ 8, ఇండియన్ ఓవర్శీస్ బ్యాంక్ మైనస్ 1 గా ఉంది. ఒక్క బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రమే పాజిటివ్ 10 గెయిన్ అయింది. 2021లో PSUలు... వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ కొనసాగుతుందని జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనాలేస్తున్నాయి. సెన్సెక్స్ డిసెంబర్ 21 నాటికి 50వేలు దాటుతుందని గోల్డ్ మాన్ సాక్స్ వంటి సంస్థలు ప్రకటించాయి. అయితే బుల్లిష్ అన్ని రంగాలకు వర్తిస్తుందని చెప్పలేమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సెక్టార్ లో స్టాక్ మార్కెట్ల సానుకూలంగా ఉన్నా.. పబ్లిక్ సెక్టార్ షేర్లపై పూర్తి భరోసా ఇవ్వలేమంటున్నాయి. బ్యాంకుల పనితీరు ఆధారంగానే వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. పాజిటివ్ వాతావరణం కనిపిస్తే మాత్రం షేర్లు పర్వాలేదనిపించే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 2020, మార్చి 2021 ఆర్ధిక ఫలితాలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ షేర్ల భవితవ్యం తేల్చుతాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రైవేటు రంగంలో ఉన్న HDFC, ICICI, RBL,మహీంద్రా స్ట్రాంగ్ గాకనిపిస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ కు అవకాశాలున్నాయి. ఏది ఏమైనా బ్యాంకులపై ఇన్వెస్టర్లకు నమ్మకం రావాలంటే త్రైమాసిక ఫలితాలే కీలకం.

17/12/2020

రికార్డు స్థాయిలో ధరపలుకుతున్న బిట్ కాయిన్: రికార్డు స్థాయిలో ధరపలుకుతున్న బిట్ కాయిన్ అమెరికాలో ఆకర్షిస్తున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ బుధవారం తొలిసారిగా 20,000డాలర్లు దాటింది. క్రిప్టోకరెన్సీ 4.5 శాతం పెరిగి 20,440 డాలర్లకు చేరుకుంది. ఈ సంవత్సరం బిట్ కాయిన్ ఏకంగా 170 శాతానికి పైగా లాభపడింది. పెట్టుబడిదారుల నుండి డిమాండ్, త్వరిత లాభాల కోసం అనుసరించిన వ్యూహాలు గరిష్టస్థాయికి చేర్చింది. బిట్ కాయిన్ ర్యాలీ నార్త్ అమెరికా నుంచి తూర్పు ఆసియా వరకూ కనిపిస్తోంది. అమెరికా ఇన్వెస్ట్లర్లను బిట్ కాయిన్ తెగ ఆకర్షిస్తోంది. అంతేకాదు.. తగ్గుతున్న బంగారం ధరల నేపథ్యంలో బిట్ కాయన్ సేఫ్ అని భావిస్తున్నారట.

16/12/2020

క్లోజింగ్‌ బెల్‌ : వరుసగా మూడోరోజూ కొనసాగిన లాభాలు: క్లోజింగ్‌ బెల్‌ : వరుసగా మూడోరోజూ కొనసాగిన లాభాలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య వరుసగా మూడోరోజూ ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో అనూహ్యంగా కొనుగోళ్ళ మద్దతు లభించడంతో చివరికి దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంకింగ్‌, ఐటీ, టెక్నాలజీ ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌ఈ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం మీద సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 46263 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 13568 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా నిలిచాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.57శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.07శాతం, ఐషర్‌ మోటార్స్‌ 3.11శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.35శాతం, శ్రీ సిమెంట్స్‌ 2.27శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. నెస్లే 2.16శాతం, హెచ్‌యూఎల్‌ 2.14శాతం, బీపీసీఎల్‌ 1.69శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.47శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.43శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక జీఎంఆర్ ఇన్‌ఫ్రా, జేఎస్‌పీఎల్‌‌, హావెల్స్‌ ఇండియా, ఫిలాటెక్స్‌లు 52వారాల గరిష్టానికి చేరాయి.

Address

Hyderabad
500033

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919505020443

Alerts

Be the first to know and let us send you an email when profityourtrade.in posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share