Telangana Congress Insurance Department

Telangana Congress Insurance Department Telangana Pradesh Congress Committee abides by the welfare, Safety, and Security of its Family and Personal.

Hence, TPCC has introduced a innovative Insurance programme for the Congress Party men, who holds the active Membership with party

ఫైనల్ బడ్జెట్ పై - పవన్ మల్లాది . హరీష్ రావు గారి మాటలు వింటుంటే సిగ్గేస్తుంది . పెట్రోల్ పట్టుకొని పోయి అగ్గిపెట్టె మరి...
02/02/2023

ఫైనల్ బడ్జెట్ పై - పవన్ మల్లాది .

హరీష్ రావు గారి మాటలు వింటుంటే సిగ్గేస్తుంది .
పెట్రోల్ పట్టుకొని పోయి అగ్గిపెట్టె మరిచి, బక్క ప్రాణాలను బలిగొని కుర్చీ ఎక్కిన కెసిఆర్ & కంపెనీ,
పోరాట వీరులం , అని చెప్పుకునే దొంగ పోరాట వీరుడు , ఫైనల్ బడ్జెట్ లో పైసా తెచ్చుకోలేక పోయినాడు .

అస్సలు తెలంగాణ వచ్చింది మీ వాళ్ళ వల్ల కాదు
(ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాల మల్లా రెడ్డి ,పువ్వాడ అజయ్, ఇంద్ర కరణ్ రెడ్డి , సబితా ఇంద్రా రెడ్డి ,సత్యవతి రాథోడ్, దానం నాగేందర్ , సుధీర్ రెడ్డి వల్ల కాదు .... )

యువకులు చనిపోతున్నారు, తెలుగు రాష్ట్రం ప్రగతి ఆగమయితుంది అనికాంగ్రెస్ పార్టీ , తెలంగాణ ఇచ్చింది.
ఇచ్చిన తెలంగాణ కు మీరు, మీకుటుంబం ఎదో త్యాగం చేసింది అని , తెలంగాణ ప్రజలు మీకు రెండు సార్లు పట్టం కట్టి తెలంగాణను అభివృద్ధి లో ముందుకు తీసుకుపోవడానికి అధికారం ఇచ్చారు ,

కానీ ...

మీరు చేసిన ఘనకార్యాలు .....

1. 76% మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ,
2. మూడో స్తానం లో క్రిమినల్ రికార్డులు
3. మస్తు అప్పులు
4. పెరిగిన మందు అమ్మకాలు
5. ఫుల్ నిరుద్యోగులు
6. మస్తు రైతు ఆత్మ హత్యలు

బడ్జెట్ లో విద్య
1. జిల్లాకో ఏకలవ్య స్కూల్ కూడా రాలే -
2. ఒక్క నవోదయ పాఠశాల కూడా తెచ్చుకోలే.
3. 157 మెడికల్ కాలేజీలు దేశమంతా ఇస్తే , తెలంగాణాకు ఒక్కటి కూడా ఇయ్యలె .
4. 157 మెడికల్ కాలేజీలకు 157 నర్సింగ్ కాలేజీలు కూడా ఇచ్చారు .
తెలంగాణ కు మెడికల్ కాలేజీ లేదు నర్సింగ్ కాలేజ్ కూడా లేదు ... ఇది ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఉంది .

ఇగ వైద్యం ముచ్చటే లేదు

ఇగ అప్పులు
A . కనీసం అప్పులు తెచ్చుకునే పరిమితి కూడా పెంచుకో శాతకాకపాయె
B . 53 వేల కోట్ల అప్పు తెచ్చుకునే వెసులు బాటు ఉంటె , అప్పుకు కూడా అప్రూవల్ తెచుకోవాలేకపోతివి ,
C . ఉన్న అప్పులపై ఆంక్షలు కూడా తొలిగించుకునే శాత కాలేదు .
D . ప్రత్యేక గ్రాంట్ల ప్రస్తావన కూడా బడ్జెట్ లో ఎక్కించుకో లేక పోతిరి
(1350 కోట్ల - ప్రత్యేక గ్రాంటు లో - పైసాకూడా ఇయ్యక పాయె )

(40 వేల కోట్ల అప్పు సొమ్ము రాకుండా పోయింది అని ముఖ్యమంత్రి తన శాతగాని తనాన్ని బహిరంగానే చెప్పుకునే )

ఇగ ప్రాజెక్టులు
కమీషన్లు మెక్కి బలిసిన ప్రొజెక్టలకు అణా పైసా కూడా ఇవ్వలేదు.

కమీషన్ భగీరథ,
కమిషన్ కాకతీయ రెండింటికి కలిపి 24, 205 కోట్లు కేటాయించాలి అని అడుగుతే,
కమీషన్లు మెక్కి బలిసిన ప్రొజెక్టలకు ఇంకా పైసలు ఎందుకు అని కాలుతో తన్నే

ఇగ పాత వాగ్దానాలు ...
తెలంగాణ కు రావలసిన విభజన హామీలు కూడా సాదించ లేక పోతిరి.
1. కాజీ పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపాయె
2. బయ్యారం ల స్టీల్ ప్లాంట్ రాకపాయె
3. వరంగల్ లోని మెగా టెక్స్ట్ టైల్ పార్క్ రాకపాయె
4. బండి సంజయ్ - , కరీంనగర్ IIIT , ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, రూపాయీ బిళ్ళ కూడా తేషాత కాకాపాయె -
5. గుండు అరవింద్ - నేషనల్ ఇన్వెస్టిమెంట్ & మానుఫ్యాక్చరింగ్ జోన్ (జహీరాబాద్కు ) రూపాయీ బిళ్ళ కూడా తేషాత కాకాపాయె కదా
6. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - హైదరాబాద్ ఫార్మా సిటీ కి ఐదు పైసలు తేషాత కాకాపాయె.


ఇది కాక ,
కర్రు కాల్చి వాత పెట్టినట్టు .....
ఎలక్షన్ లకు పోయే "కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు 5300 కోట్లు కేటాయించే ,

తెలంగాణ కాంగ్రెస్ పోరాట పుణ్యమే .
1. పన్నుల వాటా కింద కేంద్రం 41% విడుదల చెయ్యడం ,
2. IIT కి 300 కోట్లు రావటం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పుణ్యమే .
3. సింగరేణికి 1650 కోట్లు వచ్చింది కేంద్రానికి ఉన్న 49% వాటా ఉన్నందుకే అచ్చే .

ఆంధ్రా లో కలిపిన 7 మండలాలు ఎనకకు తేకపోతివి .
ఇగ దీన్ని బట్టి సూస్తే , తెలంగాణల బీజేపీ ప్రభావం లేదు అని తెలంగాణను బీజేపీ పార్టీ పక్కకు పెట్టింది .

మొత్తానికి పేపర్ పులి తో పైసా పని కాలే ...
బండి , గుండు చేసే తొండి ని మొండి పట్టించు కొక పాయె .

ఈ రాష్ట్రం లో తెరాస ,బీజేపీ లు ఫెయిల్ అయ్యాయి అని చెప్పటానికి ఇంత కన్నా పెద్ద ప్రూఫ్ లేదు ...
కావున కాంగ్రెస్ మాత్రమే తెలంగాణకు దేశానికి దిక్కు ...

ఇట్లు
మీ
పవన్ మల్లాది .
చైర్మన్ - ఇన్స్యూరెన్స్ & క్లెయిమ్స్

తెలంగాణా ప్రజలకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు #నూతనసంవత్సరశుభాకాంక్షలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ -...
02/01/2023

తెలంగాణా ప్రజలకు, శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు
#నూతనసంవత్సరశుభాకాంక్షలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ - ఇన్సూరెన్సు విభాగం.
భీమా కోసం కావలసిన పత్రాలు

రాజీవ్ గాంధీ ప్రమాద భీమా పొందటానికి తప్పని సరిగా కావలసిన పత్రాలు .
99 1993 1993 - ఈ నెంబర్ ను వాట్సాప్ లో ఆడ్ చేసుకోండి.
Hi అని type చెయ్యగానే , మీకు రిప్లై వస్తుంది దానిలో ఒక "లింక్ ఉంటుంది "దానిపై క్లిక్ చెయ్యండి .
అందులో వచ్చిన అప్లికేషన్ ఫారం లో పూర్తి వివరాలు నింపాలి .
తర్వాత ఈ క్రింది పత్రాలు గాంధీ భవన్ లో ఇన్సూరెన్సు ఆఫీస్ లో అందించాలి .
(తప్పని సరి అయితేనే కాల్ చెయ్యండి ).

టీపీసీసీ ఇన్సూరెన్సు & క్లెయిమ్స్ విభాగం Update

ప్రమాదం జరిగిన "5 రోజుల లోపే " 99 1993 1993 నెంబర్ కు వాట్సాప్ చేసి , దానిలో వచ్చే అప్లికేషన్ ఫారం నింపి
ఈ క్రింది పత్రాలను గాంధీ భవన్ లో ఇన్సూరెన్సు డిపార్ట్మెంట్ లో అందించాలి .

ఇది ప్రమాద భీమా మాత్రమే , ప్రమాదం అనగా , ఆక్సిడెంట్స్ మాత్రమే కాకుండా , చెట్టు మీదినుండి పడినా , కాలుజారిపడినా , కరెంటు షాక్ తగిలినా , పాము కాటు వేసిన , పిడుగు పడినా ,చెరువులో బావిలో కాలు జారిపడినా ప్రమాదమే . అయితే ఇటువంటి ప్రమాదాల వల్ల శరీరం లోని ఏదయినా అవయవానికి గాయం తగలడం వల్ల ఆ అవయవం పాక్షికం గా గాని పూర్తి గా గాని పనిచెయ్యక పొతే లేదా ప్రమాదం వల్ల ప్రాణ నష్టం జరుగుతే , ఈ భీమా వర్తిస్తుంది .

అయితే ఈ భీమా కోసం దరకాస్తు చేసుకున్నాక , తప్పని సరిగా , పోలీస్ , హాస్పిటల్ నుండి కావలసిన సరైన పత్రాలు జమ చేసుకొని , గాంధీ భవన్ లో ఇన్సూరెన్సు ఆఫీస్ లో 30 రోజులలో ఇవ్వాలి

1. పూర్తి వివరాలతో కూడుకున్న క్లెయిమ్ పామ్ (గాంధీ భవన్ లో ఇన్సూరెన్సు డిపార్ట్మెంట్ లో ఈ ఫార్మ్ ఉంటుంది (మా సిబ్బంది ఈ ఫార్మ్ నింపుతారు )

2. ఒకవేళ మరణించినట్టు అయితే “ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్” (ప్రభుత్వ అధికారుల చే ద్రువీకరించబడినది ) (తప్పనిసరి)

3. ప్రమాదం ప్రతికలలో ప్రచురించబడితే , దానికి సంబందించిన కాపీ.

4. F.I.R Copy (Attested by Police Authority) పోలీస్ అధికారితో ద్రువీకరించబడినది. (తప్పనిసరి)
(అన్ని ప్రభుత్వ పత్రాలు తప్పనిసరిగా ఇంగ్లీష్ లో ద్రువీకరించబడి ఉండాలి.
All the government Authority documents should be translated in English.)
(ఒక వేళ F.I.R Copy లేని యెడల M.L.C కాపీ సమర్పించవచ్చు . (తప్పనిసరి)

5. M.L.C copy (ప్రభుత్వ అధికారులతో ద్రువీకరించబడ్డ ఇంగ్లీష్ లో ఉన్న మెడికల్ లీగల్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు ) ఇంగ్లీష్ లో

6. పంచనామా కాపీ (ప్రభుత్వ అధికారులతో ద్రువీకరించబడ్డ ఇంగ్లీష్ లో ఉన్న కాపీ )
(జిరాక్స్ కాపీ అయినా దాని మీద సంతకం ప్రభుత్వ అధికారి ఒరిజినల్ సంతకం ఉండాలి (జిరాక్స్ సంతకం చెల్లదు ) (తప్పనిసరి)

7. ప్రభుత్వ అధికారులతో ద్రువీకరించబడ్డ “ఇంగ్లీష్ లో ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ “
(జిరాక్స్ కాపీ అయినా దాని మీద సంతకం ప్రభుత్వ అధికారి ఒరిజినల్ సంతకం ఉండాలి (జిరాక్స్ సంతకం చెల్లదు) (తప్పనిసరి)
8. పోలీస్ అధికారితో ద్రువీకరించబడిన ఫైనల్ రిపోర్ట్ . ఇంగ్లీష్ లో
9. ప్రమాద వశాత్తు పాక్షిక అంగ వైకల్యం అయితే ,సంబంధిత డాక్టర్ నుండి వైకల్యానికి సంబందించిన సర్టిఫికెట్ . ఇంగ్లీష్ లో (తప్పనిసరి)

10. ఆసుపత్రి కి సంబందించిన రికార్డ్స్, (అడ్మిషన్ పత్రాలు , కేసు షీట్ - డెత్ సమ్మరీ లేదా డిశ్చార్జ్ సమ్మరీ , ఒకవేళ మరణిస్తే , ధృవీకరించే పత్రాలు ) ఇంగ్లీష్ లో
11. ఇంగ్లీష్ లో ప్రభుత్వ అధికారులతో ద్రువీకరించబడ్డ ఫామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్. ఇంగ్లీష్ లో
12. I.D ప్రూఫ్స్ - నామినీ ధ్రువ పత్రాలు ,(భార్య , తల్లి , తండ్రి , పిల్లలు & బందువులు అయితే వారి I.D ప్రూఫ్స్ ) (తప్పనిసరి)

13. ప్రూఫ్స్ : ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ (xerox copies) (తప్పనిసరి)
��
ఈ పత్రాలను , హైదరాబాద్, గాంధీభవన్ లో ఇన్సూరెన్సు విభాగం లో 30 నుండి 45 రోజుల వ్యవధి లో అందించాలి.

ఈ విషయాన్ని మీరు చదివి అర్ధం చేసుకొని , మన గ్రామ , మండల , నియోజక వర్గ లో ఉన్న అందరు నాయకులకు , కార్య కర్తలకు , పార్టీ అభిమానులకు , అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారికి విధిగా పంపాలి , మీ వాట్సాప్ , ఫేసుబుక్ , గ్రూప్ లలో దీనిని పంపించాలి .

కాంగ్రెస్ పార్టీ సభ్యతం తీసుకున్న ప్రతీ ఒక్కరికి ఈ ప్రమాద భీమా వర్తిస్తుంది .

Pavan Malladi
Chairman Telangana Congress Insurance Department

https://youtu.be/EiS0CuU1b1w
09/12/2022

https://youtu.be/EiS0CuU1b1w

LIVE:శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలో పాల్గోననున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారుThe official YouTube channel of Telang...

గాంధీ భవన్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన పత్రాలు వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్న ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్  మల్లాది అం...
26/11/2022

గాంధీ భవన్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన పత్రాలు వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్న ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది అండ్ టీం.
J.J. Saidaiah Babu Madhusudan Reddy Samuel Karthik Gowripaga Hamsu Varma

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు చనిపోయిన మరియు శాశ్వత వైకల్యం చెందిన వారికి రావలసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్...
22/11/2022

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు చనిపోయిన మరియు శాశ్వత వైకల్యం చెందిన వారికి రావలసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆలస్యం అవుతున్న తరుణంలోఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఆఫీస్ లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారితో నేరుగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం జరపడం జరిగింది. వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ బాధితులకు ఇవ్వవలసిందిగా వారికి సూచించడం జరిగింది. ఈ యొక్క సమీక్షలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారు ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఇన్సూరెన్స్ క్లైమ్మ్స్ చైర్మన్ పవన్ మల్లాది గారు వికారాబాద్ డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇన్సూరెన్స్ స్టేట్ కమిటీ కోఆర్డినేటర్స్ మధుసూదన్ రెడ్డి శామ్యూల్ కార్తీక్ హంసు వర్మ మరియు ఈమేడ్ కంపెనీ సీఈవో రుచిత్ కన్నా కంపెనీ సభ్యులు శాస్త్రి దీప్తి గణేష్ గార్లు పాల్గొనడం జరిగింది.

Pavan Malladi J.J. SaidaiahBabu Madhu Sudhan Reddy Alugonda SamuelKarthik Gowripaga Hamsu Varma Harkara Venugopal Rao Ravi Mallu Anumula Revanth Reddy Telangana Congress

నిన్న గాంధీ భవన్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన పత్రాలు వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్న ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్  మల్ల...
19/11/2022

నిన్న గాంధీ భవన్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన పత్రాలు వెరిఫికేషన్ చేసి తీసుకుంటున్న ఇన్సూరెన్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది అండ్ టీం.

ఈరోజు గాంధీభవన్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇన్సూరెన్స్ విభాగం యొక్క పూర్తి అప్డేట్ని మరియు సమాచారాన్...
18/11/2022

ఈరోజు గాంధీభవన్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇన్సూరెన్స్ విభాగం యొక్క పూర్తి అప్డేట్ని మరియు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.

రెండో విడత రాజీవ్ గాంధీ ప్రమాద బీమా కి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం వారి సమయాన్ని అడగడం జరిగింది.

త్వరలో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం సమయాన్ని తేదీని సమయాన్ని తెలియజేస్తాం.

ఇట్లు
పవన్ మల్లాది
ఇన్సూరెన్స్ చైర్మన్

ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు PAC కమిటీ చైర్మన్ శ్రీ షబ్బీర్ అలీ గారు వారి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప...
17/11/2022

ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు PAC కమిటీ చైర్మన్ శ్రీ షబ్బీర్ అలీ గారు వారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం మరియు కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా సన్మానం చేయడం జరిగింది.

తరువాత "రాజీవ్ గాంధీ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్" పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రాములు గారు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబానికి టీపీసీసీ రాజీవ్ గాంధీ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల (2 లక్షల ) రూపాయల చెక్కును రాములు గారి కుటుంబానికి శ్రీ షబ్బీర్ అలీ గారు మరియు పవన్ మల్లాది చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాజీవ్ గాంధీ ప్రమాద బీమా పథకము దాని వివరాలు దానికి సంబంధించిన వీడియో ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాద భీమా పొందాలంటే చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తిగా వివరించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి టిపిసిసి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోఆర్డినేటర్ మసూద్ రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ గారు తిరుపతి రెడ్డి గారు, కామారెడ్డి నియోజకవర్గ బ్లాకు మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు ఎన్ రోలర్లు పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి నన్ను మసూద్ రెడ్డి గారిని ఆహ్వానించినందుకు షబ్బీర్ అలీ గారికి కైలాష్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఇన్సూరెన్స్ విభాగం తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

TPCC రాజీవ్ గాంధీ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ప్రభుత్వంలో లేకున్నా కార్యకర్తల కుటుంబాలను ఆపదలో ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన టిపిసిసి అధ్యక్షులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు సహకరించే TPCC కార్యవర్గం డాక్టర్ మల్లు రవి గారికి, మహేష్ గౌడ్ గారికి సిఎల్పీ అధ్యక్షులు భట్టి విక్రమార్క గారికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి చామల కిరణ్ గారికి Fayeem గారికి ఇన్సూరెన్స్ విభాగం సభ్యులకు స్నేహితులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు.

ఇట్లు
మీ
పవన్ మల్లాది
చైర్మన్
ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మరియు
బూత్ ఎన్ రోలర్స్ ట్రైనింగ్.

Address

Gandhi Bhavan, Nampally
Hyderabad
500001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 2pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Congress Insurance Department posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share