Mutual Fund Distributor

Mutual Fund Distributor AMFI Resisterd Mutual Fund Distributor ARN Code-259432 EUIN-E485465

05/02/2024
మ్యూచువల్ ఫండ్స్ లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా లేదా లాంగ్ టర్మా?“మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో మీరు ఓపికగా ఉండాలి. మ...
20/07/2023

మ్యూచువల్ ఫండ్స్ లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా లేదా లాంగ్ టర్మా?

“మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులతో మీరు ఓపికగా ఉండాలి. మంచి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది.”

మీకు ఇలాంటి మాటలు వినే ఉంటారు.

అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎంత కాలపరిమితికి అనువైనవి? షార్ట్ టర్మా లేదా లాంగ్ టర్మా?
అది ఒకరి పెట్టుబడి లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది, చాలా లక్ష్యాలు సమయాధారితంగా ఉంటాయి. తక్కువ కాలానికి అనువైన స్కీములు ఉన్నాయి, ఎక్కువ కాలానికి అనువైన స్కీములు చాలా ఉన్నాయి.

ముందుగా మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను లేదా అడ్వైజర్‌ను సంప్రదించండి, మీ ఆర్థిక లక్ష్యాలను, చర్చించిన తరువాత మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు;

ఈక్విటీ-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్-
ఎక్కువ కాలంవరకు, సాధారణంగా 5 సంవత్సరాలు మరియు ఆ పైన వాటి కొరకు

ఫిక్సిడ్ ఇన్‌కం ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ -
లిక్విడ్ ఫండ్స్- చాలా షార్ట్ టర్మ్ కొరకు – 1 సంవత్సరం కన్నా తక్కువ

షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ – మధ్యస్థ కాలానికి – 1 నుండి 3 సంవత్సరాలు.

లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ - లాంగ్ టర్మ్ కొరకు– 3 సంవత్సరాలు లేదా ఎక్కువ


మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్/పెట్టుబడి సలహాదారు మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి చేసేందుకు సరైన మ్యూచువల్ ఫండ్‌ను గుర్తించడంలో కూడా మీకు సహాయపడతారు!

మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను ఎప్పటి నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు? చైనీయుల సామెత :, “చెట్టుని నాటడానికి ఉత్తమమైన సమయం 20 ...
20/07/2023

మ్యూచువల్‌ ఫండ్స్‌లో నేను ఎప్పటి నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు?

చైనీయుల సామెత :, “చెట్టుని నాటడానికి ఉత్తమమైన సమయం 20 సంవత్సరాల పూర్వం, రెండవ ఉత్తమమైనది సమయం ఇప్పుడు.”

ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు లేనప్పుడు మినహా, జీవితంలో ఏ వయస్సు వారైన, వారి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు.


ఇన్వెస్టింగ్ ప్రారంభించడానికి కనీస వయస్సు లేదు. మీరు సంపాదించడం లేదా పొదుపు చేయడం మొదలు పెట్టగానే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.

వాస్తవానికి, పిల్లలు కూడా అప్పుడప్పుడు వారు పుట్టిన రోజులు లేదా పండుగల సమయంలో బహుమతిగా అందుకున్న డబ్బుతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి చేసి, వారి ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, గరిష్ట వయో పరిమితి లేదు.

విభిన్న ఉద్దేశ్యాలకు అనువైన విభిన్న స్కీములు మ్యుచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. దీర్ఘ కాలానికి కొన్ని అనువైనవి, కాగా కొన్నిటికి క్రమమైన ఆదాయం కొరకు సురక్షత అవసరం కావచ్చు మరియు కొన్ని తక్కువ కాలంలో కూడా లిక్విడిటీని అందిస్తాయి.

మ్యూచువల్ ఫండ్ల ఎంపిక దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలనుకునేవారు పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి ద్రవ్యో...
20/07/2023

మ్యూచువల్ ఫండ్ల ఎంపిక
దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలనుకునేవారు పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి ఇవ్వగల పెట్టుబడి మార్గాల్లో ఒకటి. అయితే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకునేటప్పుడు మదుపుదార్లు
ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

పెట్టుబడి కాలం
మ్యూచువల్ ఫండ్లలో కనీసం 8 నుంచి 10 ఏళ్ల పాటు మదుపు చేయడం మంచిది. మదుపుకు సిప్ మార్గం ఎంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. స్వల్పకాలానికైతే ఎఫ్/ఆర్డీ లాంటి పథకాలు మేలు.

వ్యయ నిష్పత్తి
మ్యూచువల్ ఫండ్ హౌస్లు మదుపర్ల పెట్టుబడుల నిర్వహణ కోసం ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ వ్యయ నిష్పత్తి 1–2% వరకు ఉండొచ్చు.

ఎన్ఏవీ
ఎన్ఏవీ విలువతో సంబంధం లేకుండా ఫండ్ పనితీరును
బట్టి రాబడి ఉంటుంది. మార్కెట్లు పతనం అయినప్పుడు ఎన్ఏవీ విలువ పడిపోతే..అప్పుడు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయొచ్చు.

రిస్క్
మ్యూచువల్ ఫండ్లలో కూడా నష్టభయం ఉంటుంది. కాబట్టి, రిస్క్ తక్కువగా తీసుకునేవారు ఇండెక్స్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. కాస్త రిస్క్ తీసుకోగలిగితే మిడ్/స్మాల్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవచ్చు.

ఫండ్ మేనేజర్
మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ అనుభవం, నిర్వహించిన ఫండ్లు, గత ఐదేళ్లలో వాటి పనితీరు వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని మంచి ఫండ్ మేనేజరు ఉన్న ఫండ్ను ఎంచుకోవాలి.

గమనిక: మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. అందుచేత మదుపు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Address

Kothapet, Factory Road, Opp. Citizen Hospital
Guntur
522001

Telephone

+919397112321

Website

Alerts

Be the first to know and let us send you an email when Mutual Fund Distributor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mutual Fund Distributor:

Share