05/12/2025
ప్రెస్ నోట్
*నిరుపేద విద్యార్థి చదువుకు 17000/– ఆర్థిక సహాయం చేసిన యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు*
మార్కాపురం ప్రాంతానికి చెందిన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థి మొహమ్మద్ జాజ్రీ విద్యను కొనసాగించేందుకు అవసరమైన మొత్తం సహాయం అందిస్తూ, YUVA CARE WELFARE SOCIETY మరోసారి తమ సేవా భావాన్ని చాటుకుంది.
సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యార్థికి ₹17,000/- విద్యా సహాయం విజయవంతంగా అందజేయబడింది. ఈ కార్యక్రమంలో YUVA CARE సేవా సైనికులు హుస్సేన్, కరీముల్లా, కరీమ్ బాషా, మాలిక్, గ్రేష్మత్ మరియు సాయి పాల్గొన్నారు.
ఈ సేవా కార్యక్రమం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అరీఫుద్దీన్ గారి మార్గదర్శకత్వంలో, మరియు కార్యక్రమ నిర్వాహకుడు షేఖ్ కరీముల్లా గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా, ఈ విద్యా సహాయ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతోంది.
విద్యార్థి మరియు అతని కుటుంబం తమ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ—
“ఈ సహాయం మా జీవితంలో ఎంతో విలువైనది… సహకరించిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు.
యువ కేర్ సంస్థ అధ్యక్షుడు ఆరీఫుద్దిన్ మాట్లాడుతూ, దేశం అభివృద్ధి చెందాలంటే దేశ ప్రజలు ఉన్నత విద్య పొందాలని, ఒక్కో కుటుంబంలో ఒక్క విద్యార్థి ఉన్నత చదువు చదివి మంచి ఉద్యోగాలు సాధించినా దేశం బాగు పడుతుందని అన్నారు. ఇప్పటికీ అనేక విద్యార్థుల చదువుకు ఎన్నో రకాలుగా తమ వంతు సహాయం చేశామని అందరి సహకారం ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఆరీఫుద్దిన్ అన్నారు.
YUVA CARE WELFARE SOCIETY
🩵 Pride to Serve